రికార్డు సమయంలో హనుమాన్ చాలీసా పఠించిన ఐదేళ్ల బాలుడు

by Mahesh |   ( Updated:2023-08-29 09:54:24.0  )
రికార్డు సమయంలో హనుమాన్ చాలీసా పఠించిన ఐదేళ్ల బాలుడు
X

దిశ, వెబ్‌డెస్క్: పంజాబ్ రాష్ట్రంలోని భటిండా కు గీతాన్ష్ గోయల్ అనే ఐదేళ్ల బాలుడు తక్కువ సమయంలో హనుమాన్ చాలీసా పఠించి రికార్డు సృష్టించాడు. దీంతో ఆ పిల్లాడు 'ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్' నుండి ప్రశంస పత్రాన్ని అందుకున్నాడు. కాగా దీనిపై బాలుడి తండ్రి డాక్టర్ విపిన్ గోయల్ మాట్లాడుతూ.. "నిన్న మాకు రాష్ట్రపతి భవన్ నుంచి ఫోన్ కాల్ వచ్చింది. మా బిడ్డ రాష్ట్రపతిని కలిసేందుకు పిలిచారు. మాకు చాలా సంతోషంగా ఉంది.. మేము చాలా సంతోషంగా ఉన్నాము. గర్వంగా కూడా ఉన్నామని చెప్పుకొచ్చాడు.

Advertisement

Next Story