- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
తుఫాను వణుకు.. నలుగురి మృతి, 70 మందికి గాయాలు
దిశ, నేషనల్ బ్యూరో : ఉత్తర పశ్చిమ బెంగాల్‌లోని జల్‌పాయ్‌గురి జిల్లాలో ఉన్న సముద్రతీర ప్రాంతాలను ఆదివారం తుఫాను వణికించింది. తుఫాను వల్ల సంభవించిన విధ్వంసంలో నలుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోగా, 70 మంది గాయాలపాలయ్యారు. గాయపడిన వారిని హుటాహుటిన సమీపంలోని ఆస్పత్రుల్లో చేర్పించారు. చనిపోయిన నలుగురిని దిజేంద్ర నారాయణ్ సర్కార్ (52), అనిమా బర్మన్ (45), జాగెన్ రాయ్ (72), సమర్ రాయ్ (64)గా గుర్తించారు. ఈదురుగాలుల ధాటికి జల్‌పాయ్‌గురి జిల్లా కేంద్రంతో పాటు దాని పొరుగున ఉన్న మైనగురి టౌన్‌లోని అనేక ఇళ్లు దెబ్బతిన్నాయి. చెట్లు నేలకూలాయి. విద్యుత్ స్తంభాలు పడిపోయాయి.తుఫాను వల్ల ఎక్కువగా ప్రభావితమైన ప్రాంతాల్లో రాజర్‌హట్, బర్నిష్, బకాలీ, జోర్పక్డి, మధబ్దంగా, సప్తిబరి ఉన్నాయి. ఆయా ఏరియాల్లో సహాయక చర్యలు చేపట్టేందుకు రెస్క్యూ టీమ్స్ రంగంలోకి దిగాయి. తుఫాను ప్రభావిత ప్రాంతాలకు సివిల్ అడ్మినిస్ట్రేషన్, పోలీసులు, డిజాస్టర్ మేనేజ్‌మెంట్ నిపుణులతో కూడిన టీమ్స్‌ను పంపామని బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వెల్లడించారు. సముద్రతీర ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రదేశాలకు తరలిస్తున్నామని చెప్పారు. ఆదివారం మధ్యాహ్నం ఆకస్మికంగా కురిసిన భారీ వర్షాలు, ఈదురు గాలుల వల్ల జల్పాయిగురి-మేనాగురి ప్రాంతాలలో జనజీవనం అస్తవ్యస్తమైందన్నారు. చనిపోయిన వారి కుటుంబాలకు, గాయపడిన వారికి పరిహారం అందేస్తామని సీఎం తెలిపారు.