హత్రాస్ ఘటనపై కేసు నమోదు.. ఎఫ్ఐఆర్ లో ఏముందంటే?

by Shamantha N |
హత్రాస్ ఘటనపై కేసు నమోదు.. ఎఫ్ఐఆర్ లో ఏముందంటే?
X

దిశ,నేషనల్ బ్యూరో: ఉత్తరప్రదేశ్‌ హత్రాస్ ఘటనపై కేసు నమోదైంది. ఈ తొక్కిసలాటకు గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. నిర్వాహకుల అలసత్వం, సరిపడా పోలీసు బలగాలు లేకపోవడనే కారణమని అంచనా వేస్తున్నారు. సత్సంగ్ కార్యక్రమానికి 80 వేల మంది వరకు హాజరయ్యేందుకు అనుమతి ఇచ్చినట్లు పోలీసులు తెలిపారు. కానీ, ఆ కార్యక్రమానికి 2.5 లక్షల మంది వచ్చినట్లు ఎఫ్ఐఆర్ లో పేర్కొన్నారు. ఇకపోతే, పోలీసులు సత్సంగ్ నిర్వాహకులపై కేసు నమోదు చేశారు. ముఖ్యసేవాదార్ దేవ్ ప్రకాశ్ మధుకర్, ఇతర ఆర్గనైజర్ల పేర్లను ఎఫ్ఐఆర్ లో చేర్చారు. కానీ, బాబా పేరుని ఇందులో పేర్కొనలేదని పోలీసులు తెలిపారు. మరోవైపు, తొక్కిసలాట జరిగిన తర్వాత భోలే బాబా ఆచూకీ తెలియరావట్లేదు. ఆయన కోసం పోలీసులు గాలిస్తున్నారు. కార్యక్రమం ముగిశాక భోలే బాబా కారులో వెళ్లిపోయారని తెలిపారు. ఆయన కారు కింద ధూళి కోసం జనం ఒక్కసారిగా ఎగబడారని అన్నారు. బాబా దగ్గరకు జనంరాకుండా ఆయన సహాయకులు అడ్డుకున్నారని.. దీంతో భారీ తొక్కిసలాట జరిగిందని పోలీసులు పేర్కొన్నారు. ఈ ఘటనలో మృతుల సంఖ్య 121కి చేరిందని అధికారులు తెలిపారు.

కోర్టులో పిటిషన్లు

తొక్కిసలాట సమయంలో కేవలం 40 మంది అధికారులు మాత్రమే విధుల్లో ఉన్నారని ప్రత్యక్ష సాక్షులు పేర్కొన్నారు. తగినంత మంది అధికారులు లేకపోవడంతోనే ఇకపోతే, హత్రాస్‌ ఘటనపై సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. గతంలో జరిగిన తొక్కిసలాట ఘటనల నుంచి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి గుణపాఠాలు నేర్చుకోలేదని అందులో పిటిషనల్ పేర్కొన్నారు. దీనిపై కఠిన మార్గదర్శకాలు జారీ చేయాలని అభ్యర్థించారు. మరోవైపు, ఘటనపై సీబీఐ దర్యాప్తు చేపట్టాలని అలహాబాద్‌ హైకోర్టులో మరో పిటిషన్ దాఖలైంది.

Advertisement

Next Story