Helicopter Crash: హెలికాప్టర్ కూలిన ఘటనలో ఇద్దరి మృతదేహాలు లభ్యం

by Shamantha N |
Helicopter Crash: హెలికాప్టర్ కూలిన ఘటనలో ఇద్దరి మృతదేహాలు లభ్యం
X

దిశ, నేషనల్ బ్యూరో: అరేబియా సముద్రంలో హెలికాప్టర్ కూలి గల్లంతైన ముగ్గురిలో ఇద్దరి డెడ్ బాడీలు లభ్యమయ్యాయి. ఇండియన్ కోస్ట్ గార్డ్ కు(Indian Coast Guard) చెందిన హెలికాప్టర్‌ (Advanced Light Helicopter) సోమవారం అర్ధరాత్రి ప్రమాదానికి గురైంది. అత్యవసర ఆపరేషన్‌కు వెళ్తుండగా అరేబియా సముద్రంపై ఎమర్జెన్సీ ల్యాండ్‌ అవుతూ కూలిపోయింది. ఈ ఘటనలో సిబ్బంది ఒకరిని కోస్ట్‌గార్డ్‌ సిబ్బంది రక్షించగా.. మరో ముగ్గురు గల్లంతైనట్లు అధికారులు వెల్లడించారు. కాగా.. ఆ ముగ్గురిలో ఇద్దరి డెడ్ బాడీలను అధికారులు మంగళవారం వెలికితీశారు. మృతులు కమాండెంట్ విపిన్ బాబు, ఎన్వీకే కరణ్ సింగ్ గా గుర్తించినట్లు పోర్‌బందర్ కోస్ట్ గార్డ్ డిఐజి పంకజ్ అగర్వాల్ తెలిపారు.

అసలేం జరిగిందంటే?

పోర్‌బందర్‌కు (Porbandar) 45 కిలోమీటర్ల దూరంలో అరేబియా సముద్రం(Arabian Sea)లో ఉన్న మోటార్‌ ట్యాంకర్‌ హరిలీలాలో సిబ్బందికి తీవ్ర గాయమైంది. దీంతో అక్కడ్నుంచి ఐసీజీకి ఎమర్జెన్సీ మెసేజ్ అందింది. గాయపడిన ఆ సిబ్బందిని తరలించేందుకు సోమవారం రాత్రి 11 గంటల ప్రాంతంలో ఏఎల్ హెచ్ రెస్క్యూ ఆపరేషన్ కోసం బయల్దేరింది. మార్గమధ్యలోనే హెలికాప్టర్ లో సమస్య తలెత్తడంతో ఎమర్జెన్సీ ల్యాండ్‌ అవ్వాల్సి వచ్చింది. ఈ క్రమంలోనే హెలికాప్టర్‌ ప్రమాదానికి గురైంది. ఈ ఘటన సమయంలో అందులో నలుగురు సిబ్బంది ఉన్నారు. అప్రమత్తమైన కోస్ట్‌గార్డ్‌ దళాలు తక్షణమే సహాయక చర్యలు చేపట్టాయి. హెలికాప్టర్‌ శకలాన్ని గుర్తించి అందులో ఓ సిబ్బందిని కాపాడారు. మంగళవారం మరో ఇద్దరి డెడ్ బాడీలు వెలికితీగా.. మరొకరి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదానికి గురైన హెలికాప్టర్‌ ఇటీవల గుజరాత్‌ వర్షాల సమయంలో 67 మందిని కాపాడి సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు అధికారులు తెలిపారు.

Advertisement

Next Story