మిజోరంలో గ్రానైట్ క్వారీ కూలిన ఘటనలో 17కి చేరిన మృతుల సంఖ్య

by Harish |
మిజోరంలో గ్రానైట్ క్వారీ కూలిన ఘటనలో 17కి చేరిన మృతుల సంఖ్య
X

దిశ, నేషనల్ బ్యూరో: రెమాల్ తుఫాను ప్రభావంతో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా మంగళవారం ఉదయం 6 గంటల ప్రాంతంలో మిజోరాంలోని ఐజ్వాల్ జిల్లాలో ఒక గ్రానైట్ క్వారీ కూలిపోయింది. ఈ ఘటనలో 17 మంది మరణించగా, మరో 6-7 మంది వరకు శిథిలాల క్రింద చిక్కుకున్నట్లు అధికారులు తెలిపారు. గత కొద్ది రోజులుగా వర్షాలు కురుస్తుండటంతో గ్రానైట్ క్వారీ ఒక్కసారిగా కూలిపోయి అక్కడే ఉన్నటువంటి కార్మికులపై పడింది. సమాచారం అందుకున్న వెంటనే అధికారులు సహాయక చర్యలు ప్రారంభించారు. ఇప్పటి వరకు 17 మృత దేహాలను శిథిలాల నుంచి వెలికి తీయగా, మరికొంతమంది రాళ్ల క్రిందనే ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు.

చనిపోయిన వారిలో నాలుగేళ్ల బాలుడు, ఆరేళ్ల బాలిక ఉన్నట్లు ఒక పోలీసు అధికారి తెలిపారు. ప్రమాదం గురించి తెలుసుకున్న ముఖ్యమంత్రి లాల్దుహోమా తీవ్ర విచారాన్ని వ్యక్తం చేశారు. పరిస్థితిని సమీక్షించి బాధితులకు అన్ని రకాల సాయం అందించాలని అధికారులను ఆదేశించారు. ఈ ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున రూ. 4 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. ఇదిలా ఉండగాభారీ వర్షాల కారణంగా ఐజ్వాల్‌లోని సేలం వెంగ్‌లో కొండచరియలు విరిగిపడటంతో ఒక భవనం కొట్టుకుపోయింది, దీంతో ముగ్గురు వ్యక్తులు కనిపించకుండ పోయారు, వారిని కనిపెట్టడానికి సెర్చ్ ఆపరేషన్‌ను నిర్వహిస్తున్నారు.

Advertisement

Next Story