- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బ్రేకింగ్: ఢిల్లీ ఈడీ కార్యాలయం వద్ద హై టెన్షన్.. రంగంలోకి కేంద్ర బలగాలు
దిశ, వెబ్‌డెస్క్: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో భాగంగా ఎమ్మెల్సీ కవిత ఇవాళ ఈడీ ఎదుట విచారణకు హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకుండా ఢిల్లీలోని ఈడీ కార్యాలయం వద్ద పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. కవిత విచారణ నేపథ్యంలో బీఆర్ఎస్ కార్యకర్తలు పెద్దఎత్తున్న ఢిల్లీ చేరుకోవడంతో అప్రమత్తమైన పోలీసులు ఈడీ కార్యాలయం వద్ద భద్రతా కట్టుదిట్టం చేశారు.
ఎమ్మెల్సీ కవిత విచారణ నేపథ్యంలో భద్రతను భారీగా పెంచారు. ఢిల్లీ ఈడీ కార్యాలయం పరిసరాల్లో 144 సెక్షన్ విధించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా కేంద్ర బలగాలను రంగంలోకి దింపి.. ఈడీ కార్యాలయం చుట్టూ కేంద్ర బలగాలను మెహరించారు. కాసేపట్లో ఎమ్మెల్సీ కవిత ఈడీ ఎదుట విచారణకు హాజరుకానున్నారు. దీంతో కవితకు మద్దతుగా బీఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఢిల్లీలోని కవిత నివాసానికి చేరుకుంటున్నారు. ఇక, మంత్రులు కేటీఆర్, హరీష్ రావు కవితకు మద్దతుగా శుక్రవారం రాత్రే ఢిల్లీకి వెళ్లిన విషయం తెలిసిందే.
Also Read: ఫ్లాష్: విచారణకు కొద్ది నిమిషాల ముందు కేటీఆర్‌తో భేటీ అయిన కవిత