- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వడదెబ్బకు 19 మంది హజ్ యాత్రికులు మృతి
X
దిశ, నేషనల్ బ్యూరో: పవిత్ర హజ్ యాత్రపై వడగాలుల ఎఫెక్ట్ పడింది. వడదెబ్బ బారినపడి తాజాగా 19 మంది హజ్ యాత్రికులు చనిపోయారు. మరణించిన హజ్ యాత్రికుల్లో 14 మంది జోర్డాన్ దేశస్తులు కాగా, ఐదుగురు ఇరాన్ దేశస్తులు. ఇక హజ్ యాత్రకు వచ్చిన 17 మంది జోర్డాన్ దేశస్తులు తప్పిపోయారు. వారి ఆచూకీ కోసం వెతుకుతున్నారు. సోమవారం రోజు మక్కాలో 47 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉందని సౌదీ అరేబియా వాతావారణ శాఖ అంచనా వేసింది. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో అత్యంత వేడి ఉంటుందని, హజ్ యాత్రికులు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సౌదీ ఆరోగ్య శాఖ సూచించింది. ఆ సమయంలో బయటతిరగొద్దని కోరింది.
Advertisement
Next Story