- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
కన్హయ్య కుమార్ పై ఇంక్ జల్లిన కేసులో వ్యక్తి అరెస్టు
దిశ, నేషనల్ బ్యూరో: ఈశాన్య ఢిల్లీ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి కన్హయ్య కుమార్‌పై సిరా విసిరిన నిందితుడ్ని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడు అజయ్ కుమార్ ని అరెస్టు చేసినట్లు తెలిపారు నార్త ఈస్ట్ డీసీపీ జాయ్ టిర్కీ. కాగా.. మే 17న ఆమ్ ఆద్మీ పార్టీ ఆఫీస్ నుంచి బయటకు వస్తున్న కన్హయ్య కుమార్ పై ఇంక్ జల్లి, చెంపదెబ్బ కొట్టేందుకు కొందరు ప్రయత్నించారు. కన్హయ్యకు పూలమాల వేస్తానని వచ్చి చెప్పుతో కొట్టేందుకు యత్నించారు. ఈ కేసులోనే అజయ్ కుమార్ ని అరెస్టు చేశారు పోలీసులు.
అయితే, ఈ దాడికి పాల్పడింది బీజేపీ ఎంపీ అభ్యర్థి మనోజ్ కుమార్ అని కన్హయ్య ఆరోపించారు. ఆయనపై దాడి జరిగినప్పుడు స్థానిక కౌన్సిలర్ ఛాయా శర్మ కూడా ఆయన వెంట ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ తనను అభ్యర్థిగా నిలబెట్టినప్పట్నుంచి మనోజ్ తివారీ రెచ్చగొట్టేందుకు యత్నిస్తున్నారని పేర్కొన్నారు కన్హయ్య. తనకు పెరుగుతున్న ప్రజాదరణ చూసి సిట్టింగ్ ఎంపీ మనోజ్ తివారీ నిరాశ చెందారని అన్నారు. అందుకే, తనపై దాడికి గూండాలను పంపారని ఆరోపించారు. మే 25న ఓటింగ్ తో ప్రజలే హింసకు సమాధానం చెప్తారని అన్నారు.
కాగా.. ఢిల్లీలో మొత్తం ఏడు లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. ఈ స్థానాలకు మే 25న పోలింగ్ జరగనుంది. ఈశాన్య ఢిల్లీ లోక్‌సభ స్థానం నుండి మనోజ్ తివారీని అభ్యర్థిగా ప్రకటించింది బీజేపీ హైకమాండ్. మరోవైపు కాంగ్రెస్ ఈ స్థానం నుంచి కన్హయ్య కుమార్‌ను అభ్యర్థిగా ప్రకటించింది కాంగ్రెస్. ఈ స్థానంలో వీరిద్దరి మధ్య గట్టి పోటీ ఉంది. కన్హయ్య తన రాజకీయాలను జేఎన్ యూ నుంచి ప్రారంభించారు. మనోజ్ తివారీ ప్రముఖ నటుడు, గాయకుడు.. ఆతర్వాతే రాజకీయాల్లోకి ప్రవేశించారు.