- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
US-Syria: సిరియాపై అమెరికా వైమానిక దాడులు.. ప్రకటించిన బైడెన్
దిశ, నేషనల్ బ్యూరో: సిరియాలో అంతర్యుద్ధం వల్ల కల్లోల పరిస్థితులు ఏర్పడ్డాయి. అధ్యక్షుడు బషర్ అల్ అసద్ దేశాన్ని వీడారు. తిరుగుబాటు దారులు అసద్ కుటుంబ పాలనను (Syria in Rebels Hands) అంతమొందించారు. కాగా.. ఇలాంటి టైంలో అమెరికా వైమానిక దాడులు (Syria in Rebels Hands) చేపట్టింది. అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ ఈవిషయాన్ని ప్రకటించారు. సిరియాను (Syria) రెబల్స్ తమ అధీనంలోకి తీసుకొచ్చాక ఈ విషయంపై వైట్ హౌజ్ దగ్గర బైడెన్ మీడియాతో మాట్లాడారు. ప్రస్తుత పరిస్థితులు సిరియాలో అనిశ్చితిక, ఉగ్ర ముప్పునకు దారి తీయొచ్చన్నారు. అధికార మార్పు సమయంలో పొరుగున ఉన్న జోర్డాన్, లెబనాన్, ఇరాక్, ఇజ్రాయెల్ కు ముప్పు వాటిల్లే అవకాశం ఉందన్నారు. ఆయా దేశాధినేతలో చర్చలు జరుపుతానన్నారు. ఈ పరిస్థితులను ఇస్లామిక్ స్టేట్ ఉగ్రసంస్థ తమకు అనుకూలంగా మార్చుకునే ప్రమాదం ఉందన్నారు. అలా జరగకూడదనే చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. సిరియాలోని ఐసిస్ శిబిరాలు(ISIS Camps), కార్యవర్గంపై తమ దళాలు డజనకు పైగా వైమానిక దాడులు చేశాయని బైడెన్ ప్రకటించారు.
సిరియా భవిష్యత్
అంతేకాకుండా, సిరియా భవిష్యత్ గురించి జో బైడెన్ మాట్లాడారు. ‘‘బషర్ అసద్, ఆయన తండ్రి పాలనలో సిరియా దాదాపు 50 ఏళ్ల పాటు చిత్రహింసలు అనుభవించింది. 13 ఏళ్ల పాటు అంతర్యుద్ధంలో మగ్గింది. వేలాది మంది అమాయకులు చనిపోయారు. రెబల్స్ వీటిని అంతమొందించాయి. అసద్ ను పారిపోయేలా చేశాయి. ఆయన పాలన ముగియడంతో న్యాయం జరిగినట్లైంది. ఉజ్వల భవిష్యత్ నిర్మించుకునేందుకు సిరియాకు ఇదో గొప్ప ఛాన్స్ ’’ అని బైడెన్ తెలిపారు.