సింగరేణి ఫిట్ కమిటీ సమావేశాన్ని అడ్డుకున్న జాతీయ కార్మిక సంఘాలు

by Sridhar Babu |
సింగరేణి ఫిట్ కమిటీ సమావేశాన్ని అడ్డుకున్న జాతీయ కార్మిక సంఘాలు
X

దిశ, గోదావరిఖని : తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం టీబీజీకేఎస్ పదవీకాలం ముగిసింది. దీంతో సింగరేణి వ్యాప్తంగా జరిగే అన్ని సమావేశాలకు జాతీయ కార్మిక సంఘాలను ఆహ్వానించాలని ఇప్పటికే సింగరేణి సీ అండ్ ఎండీ శ్రీధర్‌కు, అధికారులకు సెంట్రల్ లేబర్ కమిషనర్‌తో పాటు, డీఏంఎస్ డైరెక్టర్ ఆఫ్ మైన్స్ సేఫ్టీ సౌత్ జోన్ నుండి సింగరేణి అధికారులకు సర్యులర్ విడుదలైంది.

అయితే ప్రతీ నెలా నిర్వహించే ఫిట్ కమిటీ సమావేశాన్ని శుక్రవారం 2ఏ గనిలో సింగరేణి అధికారులు నిర్వహిస్తున్న సమయంలో జాతీయ కార్మిక సంఘాలు అక్కడికి వెళ్లి సమావేశాన్ని అడ్డుకున్నారు. తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘంతో పాటు సమానంగా ఇక మీదట సేఫ్టీ కమిటీ, మైనింగ్, డివిజన్ ఇలా సింగరేణి వ్యాప్తంగా తమకు ప్రాధ్యానత ఉండాలని జాతీయ కార్మిక సంఘాల డిమాండ్ చేశారు. ఇప్పటికే సౌత్ జోన్ నుండి సింగరేణికి సర్క్యులర్ విడుదల కావడంతో సింగరేణి వ్యాప్తంగా గుర్తింపు ఎన్నికలపై జోరుగా చర్చ సాగుతోంది.

Advertisement

Next Story