- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ప్రగతిభవన్‌లో త్రివర్ణ పతాకావిష్కరణ చేసిన కేసీఆర్
దిశ, తెలంగాణ బ్యూరో : సీఎం అధికారిక నివాసం ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. 75వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని జాతీయ పతాకాన్ని ఎగురవేసి మహనీయుల త్యాగాలను స్మరించుకున్నారు. అదే విధంగా గాంధీభవన్‌లో టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి, బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌తో పాటు పలువురు జెండావిష్కరణ చేశారు.
జెండావిష్కరణ చేసిన ఏపీ సీఎం జగన్
విజయవాడలో ఏపీ సీఎం జగన్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మహనీయులకు నివాళులర్పించారు. అనంతరం ఒపెన్ టాప్ జీపుపై స్టేడియంలో తిరుగుతూ సీఎం పరేడ్‌ను పరిశీలించారు. జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో సీఎస్ ఆదిత్యనాద్ దాస్, డీజీపీ గౌతమ్ సవాంగ్, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
తెలంగాణ భవన్‌లో…
దిశ, తెలంగాణ బ్యూరో : టీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్‌లో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. పార్టీ సెక్రటరీ జనరల్, ఎంపీ కే కేశవరావు జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజలకు 75వ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. హక్కుల కోసం, స్వేచ్ఛకోసం బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా జరిగి పోరాటాల ఫలితమే నేటి స్వాతంత్య్ర వేడుకలని అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు ఎమ్మెల్సీలు, హుజూరాబాద్ టీఆర్‌ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్, తదితరులు పాల్గొన్నారు.