- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జాతీయ విద్యా విధానాన్ని సవరించాలి
దిశ, న్యూస్‌బ్యూరో : ప్రజాస్వామ్యం, లౌకికతత్వం, సామాజిక న్యాయం తదితర లక్ష్యాలకు అనుగుణంగా జాతీయ విద్యావిధానాన్ని సవరించాలని టీఎస్‌యూటీఎఫ్ డిమాండ్ చేసింది. భారత పాఠశాల ఉపాధ్యాయుల సమాఖ్య (ఎస్టీఎఫ్ఐ) పిలుపు మేరకు ఆదివారం యూటీఎఫ్ రాష్ట్ర కార్యాలయం వద్ద సేవ్ ఇండియా డే సత్యాగ్రహం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎస్టీఎఫ్ఐ ఉపాధ్యక్షుడు, యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చావ రవి మాట్లాడుతూ.. స్వా తంత్ర్యోద్యమ స్ఫర్తితో ప్రభుత్వ సంస్థలను విదేశీ, స్వదేశీ కార్పొరేట్ పెట్టుబడిదారుల నుంచి కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఆశ్రితుల ప్రయోజనాల కోసమే బీఎస్ఎన్ఎల్ను నాశనం చేశారని, రైల్వే రూట్లు ప్రైవేటుకు అప్పగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
కొత్త జాతీయ విద్యావిధానం అమలు ద్వారా విద్యావ్యాపారం మరింత పెరిగే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. జాతీయ విద్యా విధానాన్ని ప్రజానుకూలంగా సవరించాలని చావ రవి డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సంఘం సీనియర్ నాయకులు ఎంఎకె దత్, డి.మస్తాన్ రావు, కనకప్ప తదితరులు పాల్గొన్నారు.