- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తహసీల్దార్ కార్యాలయానికి తాళం వేసిన రైతులు… ఎందుకంటే…?
దిశ, నర్సంపేట : నియోజకవర్గంలోని నల్లబెల్లి మండల ఎమ్మార్వో కార్యాలయానికి రైతులు తాళం వేశారు. రంగాయ చెరువు కుడి, ఎడమ కాలువ నిర్మాణాల కింద భూమి కోల్పోయిన రైతులు ఈ చర్యకు పాల్పడ్డారు. కాలువల నిర్మాణం కింద పోయిన భూమికి కాకుండా మిగతా భూమికి రైతు బంధు వర్తించాల్సి ఉంది. కానీ అధికారులు సర్వే చేసి ఇచ్చిన రిపోర్ట్ అస్పష్టంగా ఉండటంతో రైతు బంధు నగదు వారి అకౌంట్ లల్లో జమ కావడం లేదు. రిపోర్ట్ ని సరి చేసి పంపించాలని నల్లబెల్లి మండల రెవెన్యూ కార్యాలయం చుట్టూ బాధిత రైతులు ప్రదక్షిణలు చేస్తున్నా పట్టించుకోవడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు.
సర్వే చేసిన అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ఈ పరిస్థితి తలెత్తిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండలంలోని 15గ్రామాలకు చెందిన బాధిత రైతులు శుక్రవారం ఎమ్మార్వో కార్యాలయానికి చేరుకున్నారు. తమ సమస్యను పరిష్కరించాలని కోరగా తమ చేతుల్లో ఏమీ లేదని అంతా కలెక్టర్ వద్దే ఉందని సమాధానం ఇవ్వడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యాలయం తలుపులు మూసేసి తాళం వేసి నిరసన తెలిపారు. ఇప్పటికైనా తమకు న్యాయం చేయాలని బాధిత రైతులు వేడుకుంటున్నారు.