కరోనాపై పోరాటాన్ని బలోపేతం చేసేదిగా కుంభమేళా ఉండాలి

by Shamantha N |   ( Updated:2021-04-16 23:27:51.0  )
కరోనాపై పోరాటాన్ని బలోపేతం చేసేదిగా కుంభమేళా ఉండాలి
X

న్యూ ఢిల్లీ: కుంభమేళా అనేది ఇప్పుడు కొవిడ్-19పై చేస్తున్న పోరాటాన్ని బలోపేతం చేయడానికి మాత్రమే ప్రతీకగా ఉండాలని ప్రధాని నరేంద్ర మోడీ ట్వీట్టర్ వేదికగా ప్రజలను కోరారు. హరిద్వార్‌లోని కుంభమేళలో ఇటీవల కరోనా పాజిటివ్ కేసులు పెరిగాయి. పలువురు సాధువులు, మహామండలేశ్వరులు కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రధాని మోడీ శనివారం ట్వీట్ చేశారు. ‘ఈ రోజు ఆచార్య స్వామి అవదేశానంద్ స్వామితో ఫోన్‌లో మాట్లాడాను. అక్కడి సాధువులందరి ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నాను. కుంభమేళా సాఫీగా అనుకున్న విధంగా సాగేందుకు అధికార యంత్రాంగానికి సాధువులు తమ సపోర్ట్ ఇస్తున్నారు. ఈ విషయంలో వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను’ అని ట్వీట్‌లో పేర్కొన్నారు.

Advertisement

Next Story