- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
చొప్పదండిని గాలికొదిలేసి.. హుజురాబాద్‌లో ఎంది మీ డప్పులు..?
దిశ, కరీంనగర్ సిటీ : చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ పై నారాయణపూర్ రిజర్వాయర్ ముంపు గ్రామాల ప్రజలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. నియోజకవర్గంలో ని తమ సమస్యలు పరిష్కరించాకే ఇతర ప్రాంతాల్లో ప్రచారం చేయాలంటూ శనివారం గంగాధర మండల కేంద్రంలో ధర్నాకు దిగారు. అధికార పార్టీ నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్నా.. సొంత నియోజకవర్గంలో ముంపు గ్రామాల సమస్యలు పరిష్కరించలేని దుస్థితిలో ఉన్నాడంటూ విమర్శలు చేస్తున్నారు. ‘కూట్లో రౌతు తీయలేని వ్యక్తి ఏట్లో రౌతు తీస్తానంటూ’..హుజురాబాద్ నియోజకవర్గానికి వెళ్లి మేము అది చేస్తాం.. ఇది చేస్తామంటూ డప్పులు కొడుతున్నాడని వ్యంగ్యాస్త్రాలు విసిరారు.
జిల్లాలోని గంగాధర మండలం నారాయణపూర్ చెరువుని రిజర్వాయర్‌గా మార్చి ప్రజలకు సాగునీరు అందించాలని కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో పనులు ప్రారంభించారు. నారాయణపూర్, చర్లపల్లి, మంగపేటలను ముంపు గ్రామాలుగా గుర్తించారు. కానీ, ఇప్పటివరకు పరిహారం చెల్లించకుండా ప్రస్తుతం ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు చోద్యం చూస్తున్నారని ఆయా గ్రామాల ప్రజలు ఆరోపిస్తున్నారు. ఎల్లంపల్లి నుండి నీటి విడుదల చేసినా భారీ వర్షాలు కురిసినా.. తమ ఇళ్ళలోకి నీరు వస్తోందన్నారు. పాములు, విష పురుగులతో సహావాసం చేస్తున్నా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక్కడి ఎమ్మెల్యే రవిశంకర్‌కు తమ ముంపు గ్రామాల సమస్యలపై పట్టింపు లేదు గానీ ప్రతిరోజూ హుజురాబాద్ నియోజకవర్గానికి వెళ్ళి అభివృద్ధి తమతోనే సాధ్యమంటూ చెప్పుకోవటం హేయనీయమైన చర్యగా అభివర్ణించారు.