కరోనా మరణాల కన్న ఆకలి చావులెక్కువ..ఇన్ఫోసిస్ నారాయణ!

by Shyam |
కరోనా మరణాల కన్న ఆకలి చావులెక్కువ..ఇన్ఫోసిస్ నారాయణ!
X

దిశ, వెబ్‌డెస్క్: కొవిడ్-19 కారణంగా దేశం మొత్తం లాక్‌డౌన్ చట్రంలో ఉంది. అన్ని కార్యకలాపాలు నిలిపేయడం వల్ల ఆర్థిక వ్యవస్థ కుంటుపడింది. అన్ని రంగాల్లోనూ నష్టాలు తప్పట్లేదు. ప్రజలైతే బయటికి రావడానికి కూడా శంకిస్తున్నారు. ముందు ముందు ఎలాంటి పరిస్థితులు ఉండబోతున్నాయో ఊహించుకుంటూ బెంబెలెత్తిపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో లాక్‌డౌన్ గనక పొడిగితే ఏం జరుగుతుంది? దీనికి దేశంలోనే రెండవ అతిపెద్ద ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయన మూర్తి స్పందించారు. కరోనాను నిలువరించేందుకు లాక్‌డౌన్ గనక పొడిగిస్తే ఇండియాలో కరోనా మరణాల కంటే వేగంగా ఆకలి చావులు ఎక్కువుండొచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.

కరోనా వైరస్ తీవ్రత తెలిసిందే..అయితే, ఆరోగ్యంగా ఉన్న వారు తిరిగి ఎవరి పనుల్లో వారు బిజీ అవ్వాలని నారాయణ మూర్తి సూచించారు. ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సి విషయమొకటుంది. ఇండియా లాంటి దేశాలు లాక్‌డౌన్‌ను కొనసాగించే పరిస్థితులు లేవు. ఇలాగే కొనసాగితే కరోనా చావుల కంటే ఆకలి చావులే ఎక్కువయ్యే ప్రమాదముందని బిజినెస్ లీడర్స్‌తో జరిగిన చర్చలో తెలిపారు. ఇతర అభివృద్ధి దేశాల కన్నా మెరుగ్గా ఇండియాలో కరోనా పాజిటివ్ కేసుల్లో మరణాల రేటు తక్కువగా ఉంది. ప్రస్తుతం మరణాల రేటు 0.25 నుంచి 0.5 శాతం మధ్యలో ఉన్నాం..ఇది ఎంతో సూకూల స్థితి అని నారాయణ మూర్తి వివరించారు. సాధారణంగా దేశంలో ప్రతి సంవత్సరం 90 లక్షల మందికి పైగా మరణిస్తున్నారని, దీనికి రకరకాల కారణాలున్నాయని నారయణ మూర్తి చెప్పారు. ఈ మరణాల్లో పావు వంతు శాతం కాలుష్యం కారణంగానే మరణిస్తున్నారని, సాధారణంగా ఏడాదికి 90 లక్షల మంది చనిపోతుంటే, కరోనా వల్ల రెండు నెలల్లో వెయ్యి మంది చనిపోతున్నారు. ఈ లెక్కలను గమనిస్తే ఒక విషయం స్పష్టమవుతోంది. కరోనా వల్ల అనుకున్నంత భయాందోళనలు లేవనేది అర్థమౌతోందన్నారు.

ఇండియాలోని సుమారు 20 కోట్లమంది అసంఘటిత రంగలోనూ, స్వయం ఉపాధి పొందుతున్న వారు ఉన్నారని, లాక్‌డౌన్ వల్ల వీరందరికీ తీవ్ర ప్రతికూల ప్రభావం ఉందని మూర్తి స్పష్టం చేశారు. లాక్‌డౌన్ కొనసాగడం వల్ల వీరందర్తో పాటు అనేకమంది జీవనోపాధి కోల్పోతారని నారాయణ మూర్తి హెచ్చరించారు. అంతేకాకుండ సంస్థలు 15 నుంచి 20 శాతం ఆదాయం కోల్పోతారని, వీటి ప్రభావం వల్ల ప్రభుత్వానికి పన్ను వసూళ్లు తగ్గిపోతాయని ఆయన వివరించారు.

Tags : Narayana Murthy, Coronavirus cases in India, lockdown, coronavirus deaths, coronavirus

Advertisement

Next Story

Most Viewed