జగన్‌కు చిప్పకూడు తినిపిస్తా : నారాలోకేష్

by srinivas |   ( Updated:2021-07-31 05:44:19.0  )
జగన్‌కు చిప్పకూడు తినిపిస్తా : నారాలోకేష్
X

దిశ, ఏపీ బ్యూరో : ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ పాపాలు పండే రోజులు దగ్గరలోనే ఉన్నాయంటూ రెచ్చిపోయారు. గిరిపుత్రుల గుండెలపై గునపం దింపిన జగన్‌ పాపం పండుతుందని ట్విటర్ వేదికగా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ మాఫియా చేస్తున్న అరాచకాలు, దోపిడీలను ఆధారాలతో సహా బయటపెట్టి చిప్పకూడు తినిపిస్తానని హెచ్చరించారు.

లేటరైట్ ముసుగులో బాక్సైట్ తవ్వేస్తున్న జగన్ బంధువర్గానికి ఎన్‌జీటీ షాక్ ఇవ్వడంతో వారి గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయంటూ మండిపడ్డారు. మైనింగ్ మాఫియా పునాదులు కదులుతున్నాయని చెప్పుకొచ్చారు. బాక్సైట్ కోసం తప్పుల మీద తప్పులు చేస్తున్న జగన్ అండ్ కో, వారి అక్రమ మైనింగ్‌కు సహకరించిన అధికారులు చిప్పకూడు తినడం ఖాయమని నారా లోకేశ్ హెచ్చరించారు.

దేవినేని ఉమాపై అక్రమ కేసులు పెట్టడం దారుణం: చంద్రబాబు

మీసాలు మేలేసిన జేసీ ప్రభాకర్‌ రెడ్డి.. మరో కేసు నమోదు

Advertisement

Next Story