- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ప్రమాదంలో విశాఖ ఉక్కు.. ఆంధ్రుడా మేలుకో! :నారా రోహిత్
దిశ, సినిమా: ‘విశాఖ ఉక్కు ఆంధ్రుడి హక్కు’ అని నినదిద్దామని పిలుపునిచ్చారు యంగ్ హీరో నారా రోహిత్. త్యాగాల కొలిమి నుంచి ఉద్భవించిన విశాఖ ఉక్కు పరిశ్రమ స్థాపనకు.. ఆంధ్రులు 22వేల ఎకరాలు రాసిచ్చారన్నారు. 64 గ్రామాలను ఆనందంగా ఇచ్చేశారని.. 32 మంది తమ ప్రాణాలను తృణప్రాయంగా త్యాగం చేశారని ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఉక్కు కర్మాగారం ఉనికే ప్రమాదంలో పడుతోందని.. ‘ఆంధ్రుడా మేలుకో’ అంటూ పిలుపునిచ్చారు. 60వ దశాబ్ధంలో పోరాడి సాధించుకున్న పరిశ్రమ, 21వ శతాబ్ధంలో ప్రమాదంలో పడటం బాధ కలిగించే విషయమన్న రోహిత్.. 50ఏళ్లకు పైబడిగా కార్మికులు తమ శ్రమ, శ్వేదంతో అభివృద్ధి చేసిన కర్మాగారాన్ని ప్రైవేటుపరం చేయడమే మనం సాధించిన అభివృద్ధా? అని ప్రశ్నించారు.
కూల్చడానికది ఆవాసం కాదు. అంగట్లో అమ్మడానికది వస్తువూ కాదు. త్యాగాల కొలిమి నుంచి ఉద్భవించిన కర్మాగారం మన విశాఖ ఉక్కు. ఆంధ్రులు త్యాగధనులు కాబట్టే ఉక్కు పరిశ్రమ స్థాపనకు 22 వేల ఎకరాలు రాసిచ్చారు. 64 గ్రామాలను ఆనందంగా ఇచ్చేశారు.(1/3)
— Rohith Nara (@IamRohithNara) February 21, 2021