- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కర్నూలులో కరోనా బాధితుల ఆందోళన.. నారా లోకేశ్ ట్వీట్
దిశ, వెబ్‌డెస్క్: కొవిడ్ ఆసుపత్రుల్లో వసతులు అద్భుతం అంటూ అధికార పార్టీ నాయకుల మాటలు కోటలు దాటుతున్నాయని.. వాస్తవానికి కరోనా రోగులకు భోజనం కూడా అందని పరిస్థితి ఉందంటూ టీడీపీ నేత నారా లోకేశ్ విమర్శించారు. కర్నూలు విశ్వ భారతి ఆస్పత్రిలో భోజనం పెట్టండి మహాప్రభో అంటూ ఆందోళన చెయ్యాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు.
కోవిడ్ ఆసుపత్రుల్లో వసతులు అద్భుతం అంటూ అధికార పార్టీ నాయకుల మాటలు కోటలు దాటుతున్నాయి. వాస్తవానికి కరోనా రోగులకు భోజనం కూడా అందని పరిస్థితి. కర్నూలు విశ్వ భారతి ఆస్పత్రిలో భోజనం పెట్టండి మహాప్రభో అంటూ ఆందోళన చెయ్యాల్సిన పరిస్థితి.(1/2) pic.twitter.com/IvZGGxb6Wr
— Lokesh Nara #StayHomeSaveLives (@naralokesh) July 28, 2020
ఆసుపత్రులు, క్వారంటైన్ సెంటర్లలో కరోనా రోగులు పడుతున్న బాధలు చూస్తుంటే బాధేస్తుందని లోకేశ్ ఆవేదన వ్యక్తం చేశారు. టెస్టింగ్ కిట్లు, బ్లీచింగ్ కొనుగోలు పేరుతో కోట్లు మింగారని ఆరోపించారు. ఇప్పుడు రోగులకు ఇచ్చే భోజనాన్ని కూడా జగన్ అనుచర గణం వదలడం లేదంటూ ట్వీట్ చేశారు. కాగా, ఈ రోజు కర్నూలు విశ్వభారతి ఆస్పత్రి ఎదుట కరోనా పేషంట్లు సమయానికి భోజనం అందించండి అంటూ నిరసన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. సరైన సమయానికి కనీసం టిఫిన్ కూడా అందజేయడం లేదని కరోనా పేషంట్లు ఆరోపించడం గమనార్హం.