- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
కరోనాతో పాత్రికేయులు చనిపోవడం.. బాధాకరం
దిశ, వెబ్ డెస్క్: దేశంలో కరోనా వైరస్ కేసులు రోజురోజుకూ విస్తృతంగా వ్యాప్తిచెందుతున్నాయి. రోజూ 40 వేలకు పైగా కేసులు నమోదు అవుతూ, విలయతాండవం చేస్తోంది. అంతేగాకుండా వైరస్ బారిన పడి మృతిచెందుతున్న వారి సంఖ్య కూడా రోజూ వేగంగా పెరుగుతున్నాయి. అంతేగాకుండా వైరస్ సోకి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ, ఆక్సిజన్ అందక చనిపోయిన వారిని కూడా మనం ఇటీవల చూశాం. అయితే తాజాగా గురువారం కరోనా బారిన పడి సరైన వైద్యం అందక, ఆక్సిజన్ లేక రాజమండ్రిలో సీనియర్ పాత్రికేయుడు సుంకర రామారావు మృతి చెందిన విషయం తెలిసిందే. ఆయన మృతి పట్ల టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. రామారావు మృతి పట్ల లోకేష్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఫ్రంట్ లైన్ వారియర్స్‌గా ఎప్పటికప్పుడూ ప్రజల్ని అప్రమత్తం చేస్తున్న పాత్రికేయులు కరోనా బారిన పడి చనిపోవడం బాధాకరమన్నారు. ఆస్పత్రిలో సుంకర రామారావు పడుతున్న బాధని చూసి స్థానిక పాత్రికేయులు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా నిర్లక్ష్యంగా వ్యవహరించారని సర్కార్‌పై ఆయన మండిపడ్డారు. ఈ సందర్భంగా రామారావు కుటుంబ సభ్యులకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. కరోనాతో మృతి చెందిన జర్నలిస్టుల కుటుంబాలకు రూ. 50 లక్షలు ఆర్థిక సహకారం అందించి ఆదుకోని, జర్నలిస్ట్ హెల్త్ స్కీమ్, వర్కింగ్ జర్నలిస్ట్ ప్రమాద బీమా పథకాల ఫైల్‌ను వెంటనే క్లియర్ చేసి, వైద్య, ఆరోగ్య భద్రత కల్పించాలని లోకేష్ డిమాండ్ చేశారు.