- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఓటేసిన వారినే కాటేస్తున్నారు: నారా లోకేశ్
by srinivas |
X
దిశ, వెబ్‌డెస్క్: సీఎం జగన్ ఓటేసిన వారినే కాటేస్తున్నారని టీడీపీ లీడర్ నారా లోకేశ్ అన్నారు. మద్యపాన నిషేధం పేరుతో వైఎస్సార్సిపి ప్రభుత్వం ప్రజల్ని దోచుకుంటున్న తీరుని సోషల్ మీడియాలో ఎండగట్టినందుకు దళిత యువకుడు ఓం ప్రతాప్ ని బలితీసుకున్నారు అని ఆరోపించారు. చంపేస్తాం అంటూ వైసీపీ నాయకుల బెదిరింపులు, పోలీసుల వేధింపుల కారణంగానే చిత్తూరు జిల్లా, పుంగనూరు నియోజకవర్గం, సోమాల మండలం, కందూరు గ్రామంలో ఓం ప్రతాప్ చనిపోయాడు అని లోకేశ్ తెలిపారు.
ఓం ప్రతాప్ మృతి పై విచారణ చేపట్టాలన్నారు. ఈ ఘటన వెనుక ఉన్న వైసీపీ ముఖ్యనాయకులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. దళితులకు ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు లేదా?దళితులపై జగన్ రెడ్డి ప్రభుత్వ దాష్టికాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను.. అంటూ నారా లోకేశ్ ట్వీట్ చేశారు.
Advertisement
Next Story