Netflix : ఓటీటీ అభిమానులకు ఇక పండుగే.. స్టార్ హీరోల సినిమాలను అనౌన్స్ చేసిన నెట్‌ఫ్లిక్స్

by sudharani |
Netflix : ఓటీటీ అభిమానులకు ఇక పండుగే.. స్టార్ హీరోల సినిమాలను అనౌన్స్ చేసిన నెట్‌ఫ్లిక్స్
X

దిశ, సినిమా: ప్రముఖ ఓటీటీ (OTT) ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ (Netflix) తన క్రేజ్‌ను చూపించుకుంటోంది. ఒకప్పుడు ప్రాంతీయ చిత్రాలకు దూరంగా ఉన్న ఈ సంస్థ.. ఇప్పుడు వరుస మూవీస్‌ను అనౌన్స్ చేస్తూ సందడి చేస్తుంది. గతేడాది బాక్సాఫీస్ (box office) వద్ద బ్లాక్ బస్టర్ హిట్‌లను సొంతం చేసుకున్న అనేక సినిమాలను ప్రేక్షకులకు అందించగా.. ఈ ఏడాది కూడా అదే జోష్‌తో దూసుకెళ్తుంది. ఈ క్రమంలోనే ఇంకా రిలీజ్ కానీ పెద్ద పెద్ద సినిమాలను కూడా సొంత చేసుకుంది. సంక్రాంతి సందర్భంగా ఆ సినిమాలకు సంబంధించిన వివరాలను పంచుకుంది.

ఆ చిత్రాలు ఏంటేంటే: పనవ్ కల్యాణ్, ప్రియాంక మోహన్ ‘ఓజీ’ (OG), నాగచైతన్య, సాయి పల్లవి ‘తండేల్’ (Tandel), రవితేజ, శ్రీలీల ‘మాస్ జాతర’ (Mass Jathara), నాని, శ్రీనిధి శెట్టి ‘HIT-3’, విజయ్ దేవరకొండ, భాగ్యశ్రీ బోర్సే ‘VD-12’, సంగీత్ శోభన్, నార్నే నితిన్, రామ్ నితిన్ ‘మ్యాడ్ స్క్వేర్’ (Mad Square), సిద్ధు జొన్నలగడ్డ, వైష్ణవి చైతన్య ‘జాక్’ (Jack), ప్రియదర్శి, సాయి కుమార్ ‘కోర్ట్-స్టేట్ వర్సెస్ ఏ నోబడీ’ (Court-State vs Nobody), నవీన్ పొలిశెట్టి, మీనాక్షి చౌదరి ‘అనగనగా ఒక రాజు’ (Anaganaga Oka Raju) సినిమాలు ఉన్నాయి. ప్రజెంట్ ఇందుకు సంబంధించి అఫీషియల్ అనౌన్స్‌మెంట్స్ (Official Announcements) కూడా ఇచ్చేసింది నెట్‌ఫ్లిక్స్. కాగా.. ఈ చిత్రాలు థియేట్రికల్ రన్ తర్వాత ఒప్పందం మేరకు స్ట్రీమింగ్‌కు వస్తాయి.

Advertisement

Next Story

Most Viewed