ఒలింపిక్స్ ఓకే.. వింబుల్డన్ నాట్ ఓకే

by Shyam |
Naomi Osaka
X

దిశ, స్పోర్ట్స్: మహిళల టెన్నిస్ వరల్డ్ నెంబర్ 2 నయోమీ ఒసాక వింబుల్డన్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించింది. నాలుగు సార్లు గ్రాండ్‌స్లామ్ గెలుచుకున్న ఒసాక ఇటీవల జరిగిన ఫ్రెంచ్ ఓపెన్ తొలి రౌండ్ విజయం అనంతరం తప్పుకున్నది. మానసిక ఆందోలన కారణంగా మీడియా సమావేశాల్లో పాల్గొనలేనని చెప్పడంతో ఆమెపై వేటు వేస్తామని గ్రాండ్‌స్లామ్ అసోసియేషన్లు హెచ్చరించాయి. దీంతో ఆమె ఫ్రెంచ్ ఓపెన్ నుంచి తప్పుకోవడమే కాకుండా తాజాగా వింబుల్డన్ కూడా ఆడలేనని స్పష్టం చేసింది. ఈ మేరకు ఒసాకా మేనేజర్ స్టువర్ట్ డుగిడ్ మీడియాకు ఈ-మెయిల్ ద్వారా సమాచారం అందించాడు. కాగా, సొంత దేశం జపాన్‌లో జరుగనున్న టోక్యో ఒలింపిక్స్‌లో మాత్రం ఒసాక పాల్గొంటుందని స్పష్టం చేశాడు. హోం గ్రౌండ్ స్టేడియంలలో ఆడటానికి ఒసాకా ఆసక్తిగా ఉందని ఆయన చెప్పారు. వింబుల్డన్, ఒలింపిక్స్ నుంచి రఫెల్ నదాల్ కూడా ఫిట్‌నెస్ కారణాల కారణంగా తప్పుకున్న విషయం తెలిసిందే.

Advertisement

Next Story

Most Viewed