మంచి పేరున్న అటెండర్.. కరోనాతో మృతి

by Anukaran |
మంచి పేరున్న అటెండర్.. కరోనాతో మృతి
X

దిశ, ఆర్మూర్: నందిపేట మండల పరిషత్ కార్యాలయం అటెండర్ ఆర్మూర్ గంగారాం (59) కరోనాతో మృతిచెందారు. శుక్రవారం తెల్లవారుజామున తన ఇంట్లో గంగారం మృతిచెందారు. కరోనా పాజిటివ్ రావడంతో గత పది రోజుల క్రితం నుండి హోం క్వారెంటిన్ లో ఉంటూ డాక్టర్ల సూచనల మేరకు చికిత్స పొందుతున్నారు. గత రెండు రోజుల క్రితం ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకునేందుకు వెళ్లిన వారితో, నాన్న అన్నం తినడం లేదని ఆయన కొడుకులు తెలిపారు.

కరోనా బారి నుంచి వారం రోజుల్లో పూర్తిగా కోలుకునే స్థితికి చేరుకుంటున్న సమయంలోనే గంగారాం మృతి చెందారు. కొవిడ్-19 నిబంధనల ప్రకారంగానే ఆయన మృతదేహాన్ని ప్రత్యేక వాహనంలో తీసుకెళ్లి అంత్యక్రియలు చేస్తామని డాక్టర్ విజయ్ భాస్కర్ తెలిపారు. 40 సంవత్సరాలుగా సేవలందించిన అటెండర్ గా గంగారంకు మండలంలో మంచి పేరు ఉంది.

Advertisement

Next Story