బర్త్ డే రోజు సర్‌ప్రైజ్ ఇచ్చిన బాలయ్య.. త్వరలో వేట అంటూ పోస్టర్

by Anukaran |   ( Updated:2023-07-08 13:11:03.0  )
Nanadamuri Balakrishan
X

దిశ, వెబ్‌డెస్క్: నటసింహం నందమూరి బాలకృష్ణ ఇవాళ తన 61వ పుట్టినరోజును జరుపుకుంటున్నాడు. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో సినీ ప్రముఖులు, ఫ్యాన్స్ బాలయ్యకు విషెస్ చెబుతున్నారు. కరోనా నేపథ్యంలో బర్త్ డే వేడుకలు జరపవద్దని బాలయ్య పిలుపునివ్వడంతో.. సోషల్ మీడియాలో వేదికగా నందమూరి ఫ్యాన్స్ బాలయ్యకు విషెస్ చెబుతూ తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు.

ఈ క్రమంలో తన బర్త్ డే సందర్భంగా ఫ్యాన్స్‌కు బాలయ్య సర్‌ప్రైజ్ ఇచ్చాడు. బాలయ్య 107వ సినిమాకు సంబంధించి కీలక అప్డేట్ వచ్చింది. క్రాక్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని డైరెక్షన్‌లో బాలయ్య తన 107వ సినిమా చేయనున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై ఈ సినిమా తెరకెక్కనుండగా.. ఎస్. ఎస్ తమన్ మ్యూజిక్ అందించనున్నాడు.

బాలయ్యకు బర్త్ డే విషెస్ చెబుతూ ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ సోషల్ మీడియాలో ప్రకటించింది. దీనికి సంబంధించి ఒక వీడియోను విడుదల చేసింది. ‘వేట త్వరలో ప్రారంభమవుతుంది. హ్యాపీ బర్త్ డే బాలయ్య’ అంటూ ఆ వీడియోలో ఉంది. గోపీచంద్ మలినేనితో బాలయ్య సినిమా ఉంటుందని ఎప్పటినుంచో వార్తలు వస్తున్నాయి. కానీ ఇప్పుడు అధికారిక ప్రకటన రావడంతో బాలయ్య ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.

Advertisement

Next Story