క్యూ కట్టిన వలస కార్మికులు

by Shyam |
క్యూ కట్టిన వలస కార్మికులు
X

దిశ, హైదరాబాద్: హైదరాబాద్ మహా నగరంలోని వలస కార్మికులు వారి సొంతూళ్లకు వెళ్లేందుకు పోలీస్ స్టేషన్ల వద్ద క్యూ కడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం వలస కార్మికులను రైళ్ల ద్వారా పంపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు ప్రకటించడంతో నగరంలోని వలస కార్మికులు తమ దగ్గరలోని పోలీస్ స్టేషన్లలో పేర్లను నమోదు చేసుకునేందుకు పెద్ద ఎత్తున తరలుతున్నారు. కానీ, పోలీస్ స్టేషన్లలో సరిపడా స్థలం లేనందున వలస కార్మికులు భౌతిక దూరం పాటించడం లేదు. దీంతో పోలీసులు సమీపంలోని ఫంక్షన్ హాళ్ళలో పేర్ల నమోదును చేపడుతున్నారు. ఈ సందర్భంగా ఆధార్ కార్డు, మొబైల్ నెంబర్, నివాస స్థలం, ప్రయాణించే ప్రదేశం తదితర వివరాలను నమోదు చేసుకుంటున్నారు. ఈ వివరాలన్నింటినీ రైల్వే శాఖతో అనుసంధానంగా ఉండేలా రూపొందించిన తెలంగాణ పోలీస్ యాప్‌లో పోలీసులు తమ వద్దనున్న ట్యాబ్‌ ద్వారా నమోదు చేస్తున్నారు. ఇదే సమయంలో వలస కార్మికుడి ఫోటో కూడా తీసుకుంటున్నారు.

ఆ తర్వాత వలస కార్మికుడి మొబైల్ నెంబర్‌కు రైలు బయలుదేరు సమయం, ఎక్కడి నుంచి బయలుదేరుతుందనే వివరాలతో మెస్సేజ్ వస్తుందని, ఆ మెస్సేజ్ రాగానే ఎక్కడైతే పేర్లను నమోదు చేసుకున్నారో.. ఆ పోలీస్ స్టేషన్లకు రావాల్సి ఉంటుందని ముషీరాబాద్ సీఐ మురళీకృష్ణ తెలిపారు. ‘పోలీస్ స్టేషన్ల నుంచి కార్మికుల్ని తామే వావానాల్లో తీసుకెళ్తామని’ ఆయన వెల్లడించారు.

Tags: Migrant labour, SC Railway, Police stations, Names enrollment

Advertisement

Next Story