చంద్రబాబును షేక్ చేసిన జగన్ : రోజా

by srinivas |
చంద్రబాబును షేక్ చేసిన జగన్ : రోజా
X

దిశ, వెబ్‌డెస్క్ : ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు హాట్‌హాట్‌గా సాగుతున్నాయి. గురువారం సమావేశాల్లో భాగంగా నగరి ఎమ్మెల్యే రోజా తెలుగుదేశం పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు. వైసీపీ ప్రభుత్వం తీసుకుంటున్న ప్రతీ నిర్ణయానికి టీడీపీ నేతలు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని చెప్పారు. సీఎం జగన్ విజన్ ఉన్న నాయకుడు అని కొనియాడారు. ఆయన పాలన తీరుతో మాట్లాడితే నలభై ఏళ్ల అనుభవం అని చెప్పుకుంటున్న బాబును షేక్ చేశారని వ్యాఖ్యానించారు.

జగన్ పర్యటన సమయంలో మహిళలకు ఇచ్చిన ప్రతిహామినీ పూర్తిచేశారన్నారు. తెలుగు దేశం లీడర్లు కావాలనే పేదలకు ఇళ్లు పంపిణీ చేయకుండా అడ్డుకున్నారని విమర్శించారు. ఇక ఎమ్మెల్సీ లోకేష్ ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్‌ను ట్విట్టర్‌లో పెట్టడానికే మాత్రమే పనికొస్తారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు లేకుంటే లోకేష్ సర్పంచ్‌గా కూడా గెలవడానికి కూడా పనికిరాడని రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు.

Advertisement

Next Story

Most Viewed