- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సెనెగెల్ చిలుకల జంట కొనుగోలుకు ఆర్థిక సహయం- నాగబాబు
దిశ, చార్మినార్: ప్రముఖ సినీనటుడు కొణిదెల నాగబాబు మంగళవారం జూ పార్కును సందర్శించారు. ఈ సందర్భంగా అరుదైన సెనెగెల్ చిలుకల జంట కొనుగోలుకు అయ్యే మొత్తాన్ని విరాళంగా ఇవ్వడానికి ముందుకు వచ్చారు. ఈ సందర్భంగా 35 వేల చెక్కును జూ క్యూరేటర్‌కు నాగబాబు అందజేశారు. అనంతరం జూపార్కును శ్రద్దగా తిలకించారు.
ఈ సందర్భంగా నాగబాబు మాట్లాడుతూ, జూపార్కులోని అరుదైన వెస్టన్ ఆఫ్రికాలో మాత్రమే కనిపించే సెగెనెల్ చిలుకల జంటను జూకు బహుకరించాలని నిర్ణయించుకున్నామని, ఈ నేపథ్యంలో దానికి సంబంధించిన డబ్బును తన సోదరి విజయ తరపున జూపార్కు క్యూరేటర్‌కు అందజేశామన్నారు.
క్యూరేటర్ వీవీఎల్ సుభద్రాదేవి మాట్లాడుతూ, సినీనటుడు నాగబాబు కుటుంబ సభ్యుల తరపున జూకు చిలుకల జంటను కొనుగోలుకు అయ్యే మొత్తాన్ని విరాళంగా అందజేయడం సంతోషకరమన్నారు. నాగబాబుని స్పూర్తిగా తీసుకుని జూలో జంతువులను, పక్షులను దత్తత తీసుకోవడానికి మరికొంత మంది ముందుకు రావాలన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటి క్యూరేటర్ నాగమణితో పాటు అసిస్టెంట్ క్యూరేటర్లు , పీఆర్ఓ హనీపుల్లా, తదితర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.