- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మయన్మార్‌లో సైనిక తిరుగుబాటు
న్యూఢిల్లీ: మయన్మార్ మరోసారి ‘మిలిటరీ’ గుప్పిట్లోకి వెళ్లింది. సోమవారం తెల్లవారుజామున అనూహ్యంగా రైడ్‌లు చేసి ఆంగ్ సాన్ సూకీ సహా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన నాయకులను అదుపులోకి తీసుకుంది. అధికారాన్ని తమ అధీనంలోకి తీసుకున్నట్టు ఆర్మీ సొంత టీవీ స్టేషన్‌లో ప్రకటించింది. కమాండర్ ఇన్ చీఫ్ మిన్ ఆంగ్ లెయింగ్ అధికారాన్ని తీసుకున్నట్టు పేర్కొంది. దేశరాజధాని సహా ప్రధాన నగరాల్లో ఆర్మీ ట్రూపులు మోహరించాయి. బ్యాంకులు, ఇతర కార్యాలయాలను బలవంతంగా మూసివేయించారు.
ఆర్మీ టీవీ స్టేషన్ మినహా స్థానిక, అంతర్జాతీయ మీడియా సంస్థల సేవలను బంద్ చేసింది. ఏడాదిపాటు ఎమర్జెన్సీ అమలవుతుందని తెలిపింది. అధికారంలోని 24 మంది మంత్రులను తొలగించినట్టు పేర్కొంది. 11 స్థానాల్లో వారి అనుకూలురులతో భర్తీ చేసింది. ఏడాది క్రితం జరిగిన ఎన్నికల్లో నేషనల్ లీగ్ ఫర్ డెమొక్రసీ అధికారంలోకి వచ్చింది. ఈ ఎన్నికల్లో ఫ్రాడ్ జరిగినట్టు ఆర్మీ ఆరోపిస్తూ వచ్చింది. కానీ, ఎన్నికల కమిషన్ మాత్రం ఆర్మీ ఆరోపణలను ఖండించింది.
కాగా, మిలిటరీ చర్యలను ఆమోదించవద్దని, ప్రజలు వీధుల్లోకి వచ్చి నిరసన చేయాలని ఆంగ్ సాన్ సూకీ ఓ లేఖలో సూచించింది. లేదంటే దేశం మళ్లీ ఆర్మీ నియంతృత్వంలోకి వెళ్తుందని హెచ్చరించారు. మయన్మార్‌లో మిలిటరీ నియంతృత్వాన్ని ఎదిరించి 1989 నుంచి 2010 మధ్య కాలంలో 15 ఏళ్లపాటు నిర్బంధంలో ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు పొందారు. కానీ, రొహింగ్య ఊచకోత సమయంలో మౌనం వహించి విమర్శలపాలయ్యారు.