- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
డాక్టర్ల సంతోషం కోసం.. క్రేన్ లో పాటలు పాడిన సంగీత కళాకారులు
దిశ వెబ్ డెస్క్ : లెబనాన్ లోని బెయ్ రుట్ లో సంగీత కళాకారుల బృందం వైద్య సిబ్బంది, కరోనా బాధితుల కోసం పాటలు పాడారు. సంగీతంతో వాళ్లలో సంతోషాన్ని నింపారు. కరోనాతో ప్రపంచ మంతా ఓ వైపు పోరాడుతుంటే.. వైద్య సిబ్బంది తమ ప్రాణాలు పణంగా పెట్టి ప్రజలను రక్షించడానికి పోరు పెడుతోంది. ప్రపంచ ప్రజలంతా వైద్యుల్ని దేవుళ్లలాగా చూస్తున్నారు. కరోనా వైరస్ వ్యాప్తి మొదలైన నాటి నుంచి కంటి మీద కునుకు లేకుండా తమ పనిలో నిమగ్నమైన వైద్య బృందాన్ని.. తమ సంగీతంతో అలరించారు.
సరిహద్దులు చెరిపేస్తూ.. ప్రపంచ ప్రజలంతా ఒక్కటై కరోనాపై యుద్ధం సాగిస్తున్నారు. వైద్యులు.. సైనికుల్లా ముందుండి సమరాన్ని ముందుకు నడిపిస్తున్నారు. వైద్య బందం పడుతున్న కష్టానికి సర్వత్రా ప్రశంసలు వస్తూనే ఉన్నాయి. వారి త్యాగాన్ని ఏదో విధంగా కొనియాడుతూనే ఉన్నారు. ప్రముఖ సెర్చింజన్ గూగుల్ కూడా ప్రత్యేకమైన డూడుల్ తో వైద్య బృందానికి అభినందనలు తెలియజేసింది. అలాగే లెబనాన్ లోని, బెయ్ రుట్ కు చెందిన సంగీత కళాకారుల బృందం.. వైద్య సిబ్బందితో పాటు, కరోనా బాధితుల్లో సంతోషం నింపాలనుకున్నారు. ‘రఫిక్ హరిరి హస్పిటల్’ ముందు ఓ క్రేన్ ను వేదికగా చేసుకుని సంగీతం అందించారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. లెబనాన్ లో ఇప్పటివరకు 600 కేసులు నమోదయ్యాయి.
Tags : corona virus, lebanon, music group, agla fawad, great chaos, doctors, love,support, cheers