- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
మా కొడుకును పొట్టన బెట్టుకున్నారు..!
దిశ, వెబ్‌డెస్క్: కులాలు వేరు కావడమే హేమంత్ ను హత్య చేశారని మృతుడి తల్లిదండ్రులు ఆరోపించారు. సందీప్‌రెడ్డి, రాకేశ్‌రెడ్డి, రంజిత్‌రెడ్డి, యుగేందర్‌రెడ్డి, విజయేందర్‌రెడ్డే తమ కొడుకుని హత్య చేయించారని హేమంత్ తల్లి కన్నీరు మున్నీరయ్యారు. పలుమార్లు ఇంటికి సైతం వచ్చి తమను బెదిరించారని, హేళన చేసి మాట్లాడారని వాపోయారు. ఎన్నో ఆశలు పెట్టుకుని పెంచుకున్న కుమారుడిని దారుణంగా చంపేశారని హేమంత్ తల్లి విలపించారు.
తన కూతురిని పెళ్లి చేసుకున్నాడని యువకుడిని యువతి తండ్రి దారుణంగా హత్య చేయించిన ఘటన హైదరాబాద్ శివారులో కలకలం రేపుతోంది. వివరాల్లోకి వెళ్తే.. చందానగర్ లో నివాసముంటున్న హేమంత్ అనే యువకుడు.. అదే ప్రాంతానికి చెందిన అవంతిరెడ్డి అనే యువతి 8ఏళ్లుగా ప్రేమించుకున్నారు. వీరి ప్రేమ విషయం అవంతి తల్లిదండ్రులకు తెలియడంతో ఆమెనె ఇంట్లోనే నిర్భంధించి పెళ్లి సంబంధాలు చూశారు. ఈ క్రమంలో ఈ ఏడాది జూన్ 10వ తేదీన అవంతి ఇంటి నుంచి వచ్చేయడంతో బీహెచ్ఈఎల్ సంతోషిమాత ఆలయంలో వివాహం చేసుకున్నారు. వీరి వివాహాన్ని అవంతి తల్లిదండ్రులు, బంధువులు వ్యతిరేకించారు.
అవంతి తల్లిదండ్రులకు వివాహం ఇష్టం లేకపోవడంతో గచ్చిబౌలిలోని టీఎన్జీవో కాలనీలో నివాసం ఉంటున్నారు. ఈ క్రమంలో గురువారం సాయంత్రం అవంతి బావలు, వదినలు, మావయ్యలు, గుర్తు తెలియని వ్యక్తులు మూడు కార్లలో వచ్చి హేమంత్ ఇంటికి వచ్చి ఇద్దరిని బలవంతంగా కారులో ఎక్కించుకెళ్లారు. అవంతి కారులో దూకి తప్పించుకోగా.. హేమంత్ ను తీసుకెళ్లారు. ఈ విషయాన్ని హేమంత్ తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వడంతో వారు గచ్చిబౌలి పీఎస్ లో ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు హేమంత్ కోసం గాలింపు చర్యలు చేపట్టగా, శుక్రవారం ఉదయం సంగారెడ్డిలో హేమంత్ శవమై కనిపించాడు.
చిన్ననాటి నుంచి హేమంత్ నేను ఒకే ప్రాంతంలో పెరిగామని, ఎనిమిదేళ్ల నుంచి ప్రేమించుకున్నామని అవంతి రెడ్డి తెలిపారు. నాలుగు నెలల క్రితం వివాహం చేసుకున్నామని.. మా ఇంట్లో ఇష్టం లేకపోవడంతో గచ్చిబౌలిలో ఉంటున్నామని అన్నారు. పలుమార్లు బెదిరించడంతో ఇంట్లో నుంచి కూడా బయటకు రాలేదని వాపోయారు. హేమంత్‌ను నన్ను తమ బంధువులే బలవంతంగా లాక్కెళ్లారని.. బావ, వదినలు, మావయ్యలే ఈ హత్య చేయించారని అవంతి అన్నారు.