బంజారాహిల్స్‌లో నడిరోడ్డుపై కత్తితో దాడి..

by Shyam |
బంజారాహిల్స్‌లో నడిరోడ్డుపై కత్తితో దాడి..
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ లోని బంజారాహిల్స్‌లో దారుణం జరిగింది. మిట్టమధ్యాహ్నం నడిరోడ్డుపైనే ఓ వ్యక్తిపై కత్తితో దాడి జరిగింది. ఈ ఘటన రాష్ట్రంలోని హైదరాబాద్ మహానగరంలోని బంజారాహిల్స్‌లో శుక్రవారం చోటుచేసుకుంది. వసీం అనే వ్యక్తి పై కొందరు దుండగులు కత్తితో దాడికి పాల్పడ్డారు.

ఈ దాడిలో బాధితుడికి తీవ్ర గాయాలు కాగా, అతన్ని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని ఈ దాడికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. కాగా, రౌడీషీటర్ ఫరూక్ తనపై దాడి చేసినట్లు బాధితుడు వాంగ్మూలం ఇచ్చాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.

Advertisement

Next Story