‘సాగర్ బీజేపీ అభ్యర్థిని అందుకే ప్రకటించడం లేదు’

by Shyam |
‘సాగర్ బీజేపీ అభ్యర్థిని అందుకే ప్రకటించడం లేదు’
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో టీఆర్ఎస్‌తోనే బీజేపీకి గట్టి పోటీ ఉంటుందని ఆ పార్టీ నేత మురళీధర్‌ రావు అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దింపేందుకే బీజేపీ పోరాటం చేస్తోందన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షహోదాను కోల్పోయిందని.. బీజేపీ పుంజుకోవడంతో నాగార్జునసాగర్‌ టికెట్‌ కోసం బీజేపీ నేతల మధ్య పోటీ పెరిగిందన్నారు. అందుకే అభ్యర్థిని ప్రకటించే విషయంలో ఆలస్యం అవుతోందని మురళీధర్ రావు స్పష్టం చేశారు. ఢిల్లీలో రైతుల ఉద్యమం హింసాత్మకంగా మారడం వెనుక కాంగ్రెస్ హస్తం ఉందని మురళీధర్ రావు ఆరోపించారు.

Advertisement

Next Story