హరితహారంలో.. ఆయుర్వేద మొక్కలు

by Shyam |
హరితహారంలో.. ఆయుర్వేద మొక్కలు
X

దిశ, సంగారెడ్డి: సంగారెడ్డి పట్టణంలోని 9వ వార్డులో ఆరో విడిత హరితహారం కార్యక్రమాన్ని గురువారం ప్రారంభించారు. పట్టణ మున్సిపల్ చైర్ పర్సన్ బొంగుల విజయలక్ష్మీ రవి, వైస్ చైర్ పర్సన్ శంకరి లతా విజయేందర్ రెడ్డి, స్థానిక కౌన్సిలర్ లాడె మనీలా మల్లేశంల ఆధ్వర్యంలో గురువారం ఈ కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా సుమారు ఐదు వందల మొక్కలను నాటి ట్రీ గార్డులను ఏర్పాటు చేశారు. అదే విధంగా వార్డులోని ప్రతి ఇంటింటికి తిరిగి పూలు, పండ్లు, ఆయుర్వేద ఔషధ మొక్కలతో పాటు వేప, మామిడి, నల్లరేగు మొక్కలను పంచారు.

Advertisement

Next Story