మినీ పురపోరు మొదలైంది.. ఓట్ల లెక్కింపు షురూ..!

by Anukaran |
మినీ పురపోరు మొదలైంది.. ఓట్ల లెక్కింపు షురూ..!
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో మినీ పురపోరుకు ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. 2 కార్పొరేషన్లు, 5 మున్సిపాలిటీల్లో ఓట్ల లెక్కింపు జరుగుతుంది. వరంగల్ కార్పొరేషన్‌లో 66 డివిజన్లు, ఖమ్మంలో కార్పొరేషన్లు 59 డివిజన్లు ఉన్నాయి. సిద్దిపేట 43, కొత్తూరు 12, అచ్చంపేట 20, జడ్చర్లలో 27, నకిరేకల్‌లో 20 వార్డుల్లో ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. మధ్యాహ్నం కల్ల రాజకీయ పార్టీల ఆధిపత్యం తేలనుంది. దీంతో ఎవరు విజయం సాధిస్తారో అన్న ఉత్కంఠ అభ్యర్థులు, పార్టీల్లో నెలకొంది. ముఖ్యంగా అందరి ఫోకస్ వరంగల్, ఖమ్మం కార్పొరేషన్‌పైనే ఉందని చెప్పాలి. ఈ రెండు కార్పొరేషన్‌లో ప్రధాన పార్టీలు హోరాహోరీగా ప్రచారం నిర్వహించాయి. ఇక ఓటరు నాడి ఏ వైపు ఉందో తేలియాలంటే ఫలితాలు వచ్చే వరకు వేచిచూడాల్సిందే.

Advertisement

Next Story