- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వాస్తవాలు తప్ప వదంతులు నమ్మొద్దు
దిశ, రంగారెడ్డి: షాద్నగర్ పట్టణ ప్రజలు వాస్తవాలు తప్ప వదంతులు నమ్మకూడదని మున్సిపల్ ఛైర్మన్ నరేందర్ స్పష్టం చేశారు. మంగళవారం సాయంత్రం పట్టణంలోని పటేల్ రోడ్డులో ఢిల్లీ సదస్సుకు వెళ్లి వచ్చిన ఇబ్రహీం ఇతర వ్యక్తులను ఆయన కలుసుకున్నారు. ఈ సందర్భంగా చైర్మన్ నరేందర్ మీడియాతో మాట్లాడుతూ… ఉదయం వైద్య అధికారులు పోలీసు శాఖ సమక్షంలో ఇబ్రహీంతో పాటు మరో ఇద్దరిని కరోనా వైరస్ పరీక్షల కోసం హైదరాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలించడం జరిగిందని తెలిపారు. ఇటీవల ఢిల్లీలో జరిగిన ప్రచార సమావేశాలకు వీరు హాజరయ్యారని ఈ సందర్భంగా ప్రభుత్వ ఆదేశాల మేరకు ముందు జాగ్రత్త చర్యగా పరీక్షలకోసం తరలించడం జరిగింది అన్నారు. దేవుడి దయ వల్ల ఎవరికీ వైరస్ లేదని మెడికల్ రిపోర్టులు అన్ని అనుకూలంగా రావడం షాద్ నగర్ పట్టణానికి శుభసూచకమని చైర్మన్ అన్నారు. వైరస్ గురించి ప్రజలు ఎవరు భయపడాల్సిన అవసరం లేదన్నారు. పట్టణంలో ఏలాంటి వైరస్ ఆనవాళ్లు లేవని చెప్పారు. ప్రజలు వదంతులు నమ్మకూడదని పిలుపునిచ్చారు. కేవలం వాస్తవాలు గ్రహించాలని మున్సిపల్ కమిషనర్ నరేందర్ సూచించారు.
Tags: municipal commissioner narendar,comments, corona, shadhnagar