- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
‘మీరు పనులు వేగవంతం చేయండి’
by Shyam |
X
దిశ, వరంగల్: వరంగల్లో చేపట్టిన స్మార్ట్ సిటీ పునులను వేగవంతం చేయాలని.. కేంద్ర ప్రభుత్వ అర్బన్ అండ్ హౌసింగ్ అఫైర్స్ మిషన్ జాయింట్ సెక్రెటరీ కునాల్ కుమార్ అన్నారు. మంగళవారం ఆయన న్యూ ఢిల్లీ నుంచి మున్సిపల్ కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా స్మార్ట్ సిటీ పనుల ప్రగతి, నిధుల కేటాయింపు, అందుబాటులో ఉన్న నిధులు తదితర అంశాలపై కార్పొరేషన్‌ల వారీగా సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. లాక్‌డౌన్ కారణంగా దేశ వ్యాప్తంగా 42 స్మార్ట్ సిటీ టౌన్లలో అభివృద్ధి పనులకు అంతరాయం కలిగిందన్నారు. ప్రస్తుతం నిర్మాణాలకు వెసులుబాటు కల్పించినందున త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వరంగల్ మున్సిపల్ కమిషనర్ పమేలా సత్పతి తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Next Story