మున్సిపల్ ఛైర్ పర్సన్ ట్వీట్.. స్పందించిన కేటీఆర్

by Shyam |
Minister KTR
X

దిశ, మేడ్చల్ : జవహర్ నగర్ డంపింగ్ యార్డు వల్ల దుర్వాసన వేదజల్లుతుందని దమ్మాయిగూడ మున్సిపల్ ఛైర్ పర్సన్ ప్రణీత గౌడ్ ట్వీట్ చేశారు. డంపింగ్ యార్డు కారణంగా అక్కడి నీరు, గాలి కూడా తీవ్రంగా కలుషితం అవుతున్నాయని, తద్వారా అక్కడి ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారని ఆమె తన ట్వీట్‌లో పేర్కొంది. ఆ ట్వీట్‌ను ఐటీ మంత్రి కేటీఆర్‌కు ట్యాగ్ చేశారు. దీనిపై రాష్ట్ర పురపాలక, ఐటీ మంత్రి కేటీఆర్ స్పందించి జవహర్ నగర్ చెత్త డంపింగ్ యార్డును పరిశీలించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. దీంతో మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్దిశాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్,మేయర్ గద్వాల విజయలక్ష్మి, జీహెచ్ఎంసీ కమీషనర్ లోకేశ్ కుమార్‌లు శనివారం డంపింగ్ యార్డును పరిశీలించారు.

దీంతో పాటుగా కంపోస్టు, చెత్త సేకరణ, మున్సిపాలిటీ సాలిడ్ వేస్ట్ ప్లాంట్ ,సీఎన్జీ గ్యాస్‌తో, 20 మెగా వాట్ల పవర్ ప్లాంట్ ఉత్పత్తి కేంద్రాన్ని పరిశీలించి, అక్కడి వారితో సమీక్షించారు. ఈ సందర్బంగా అక్కడ తలెత్తుతున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆరవింద్ కుమార్ మీడియాతో మాట్లాడారు. డంప్ యార్డ్‌కి సంబంధించి రూ.146 కోట్లతో క్యాపింగ్ చేయడంతో సీఎన్జీ, సీపీజీ గ్యాస్ తయారీ చేస్తున్నట్లు స్పష్టం చేశారు. అంతేకాకుండా డంపింగ్ యార్డు కారణంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తీర్చేందుకు ప్రత్యేక నిధులు మంజురు చేసి సమస్యల పరిష్కారానికి చర్యలు చేపడుతున్నాం’ అని ఆయన తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed