- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ముంబై మ్యూజియం.. ‘వర్చువల్ టూర్’ ఆఫర్
దిశ, ఫీచర్స్ : ముంబై ఐకానిక్ ‘ఛత్రపతి శివాజీ మహరాజ్ వాస్తు సంగ్రహాలయ (సీఎస్ఎంవీఎస్)’ దర్శనీయ ప్రదేశంగా ఎంతో పేరొందింది. 99 సంవత్సరాల ఈ పురాతన మ్యూజియాన్ని ప్రతీరోజు వేలాదిమంది సందర్శించేవాళ్లు. అయితే గత ఏడాది కొవిడ్ విజృంభణతో మూసివేసిన మ్యూజియాన్ని తిరిగి ఈ ఏడాది ఫిబ్రవరిలోనే రీఓపెన్ చేశారు. ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ విలయతాండవం చేస్తుండటంతో మరోసారి మూసివేతకు గురైంది. ఈ నేపథ్యంలో ఇంటికే పరిమితమైన వారి కోసం ‘వర్చువల్’గా మ్యూజియాన్ని సందర్శించే అవకాశాన్ని కల్పించారు నిర్వాహకులు.
ఛత్రపతి శివాజీ మహరాజ్ వాస్తు సంగ్రహాలయంలో పురాతన వస్తు సేకరణలను ఇక ఆన్‌లైన్‌లో చూడొచ్చు. కల్చర్ అండ్ హెరిటేజ్‌ను ఇష్టపడేవారికి ఇది శుభవార్త. ఎందుకంటే ఈ మ్యూజియంలో శిల్పాలు, పెయింటింగ్‌లు, సహజ చరిత్ర నమూనాలు, హరప్పా నాగరికత నుంచి తీసుకొచ్చిన కళాఖండాలతో పాటు మరెన్నో చారిత్రక సాక్ష్యాలున్నాయి. CSMVS వర్చువల్ టూర్ దాని అధికారిక వెబ్‌సైట్ ద్వారా యాక్సెస్ కావచ్చు.
మ్యూజియంలోని మూడు అంతస్తుల్లోని వస్తు సామగ్రిని ఇది చూపిస్తుంది. ఇదే కాదు నేచరల్ హిస్టరీ, వాటికన్ మ్యూజియం, బ్రిటీష్ మ్యూజియం, హై మ్యూజియం ఆఫ్ ఆర్ట్, వాన్ గోగ్, సిన్సినాటి మ్యూజియమ్స్‌తో పాటు మొత్తంగా 75 ప్రపంచ స్థాయి మ్యూజియమ్స్ ఇలాంటి వర్చువల్ పర్యటనలను అందిస్తున్నాయి. అనేక వర్చువల్ టూర్లలో ఎగ్జిబిట్ వాక్-త్రూలు అనుభవించొచ్చు. ప్రపంచంలోని కొన్ని ఉత్తమ పెయింటింగ్స్, శిల్పాలను వ్యక్తిగతంగా పరిశీలించే అవకాశముంది.