- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మేడపైనే విమానాన్ని తయారు చేసిన ఘనుడు!
దిశ, వెబ్‌డెస్క్ :
పట్టుదల ఉంటే.. సాధించలేనిది ఏదీలేదని నిరూపించాడు మహారాష్ట్రకు చెందిన ఫ్లైట్ కెప్టెన్ అమోల్ యాదవ్. విమానాన్ని అలవోకగా నడపడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్యే కావచ్చు కానీ, సొంతంగా విమానం తయారు చేయగలిగేంత ప్రతిభ అతని సొంతం. అది కూడా.. ఎక్కడో విమానాల తయారీ కేంద్రంలో కాదు, తన ఇంటి మేడపైనే ఆరు సీట్ల విమానాన్ని ఒంటిచేత్తో తయారు చేశాడు. ఇందుకోసం కొన్ని సంవత్సరాలు శ్రమించిన అమోల్.. ఇటీవలే టెస్ట్ రన్ కూడా పూర్తిచేయడం విశేషం.
ముంబైలోని కండీవాలీలో నివాసముండే అమోల్ యాదవ్.. ఫ్లైట్ కెప్టెన్‌గా సేవలందించారు. కాగా, తన చిరకాల కోరికను నెరవేర్చుకునే క్రమంలో తన ఇంటి డాబాపైనే విమానాన్ని తయారుచేసి ఔరా అనిపించాడు. భారత ప్రధాని ‘మేకిన్ ఇండియా’ ఆలోచనలకు రూపమిస్తూ.. ఇండియాలోనే పూర్తి విమానాన్ని తయారుచేయాలని అనుకున్నారు. చివరికి తను అనుకున్నది సాధించిన అమోల్‌కు.. ట్రయల్ కోసం విమానాన్ని గాలిలో చక్కర్లు కొట్టించేందుకు డీజీసీఏ గతేడాది పర్మిషన్ ఇచ్చింది. ఆగస్ట్ 11న తొలి ట్రయల్ రన్ పూర్తి చేశారు. టేకాఫ్, ల్యాండింగ్‌లో ఏవైనా సమస్యలున్నాయో? లేదో తెలుసుకోవడానికి విమానాన్ని మొత్తం 12సార్లు టేకాఫ్, ల్యాండింగ్ చేసి చూశారు. అంతా సవ్యంగా సాగిపోయింది. విమానం ప్రతిసారి విజయవంతంగా టేకాఫ్, ల్యాండింగ్ అయ్యింది.
త్వరలోనే మరోసారి ట్రయల్ రన్‌కు సిద్ధమవుతుండగా.. ఈ సారి 2వేల అడుగుల ఎత్తులో దాన్ని నడపనున్నారు. ఇందుకు కూడా డీజీసీఏ అనుమతి ఇచ్చింది. ఈ ట్రయల్ కూడా సక్సెస్ అయితే.. ఇక విమానాన్ని నడుపుకోవచ్చు. సాధారణంగా విమానాన్ని ట్రయల్ రన్ చేయాలంటే, భారీగా ఇన్సూరెన్స్ కట్టాల్సి ఉంటుంది. ఇందుకోసం తన కుటుంబ సభ్యులందరూ సాయం చేశారని చెప్పాడు అమోల్. ఆరుగురుకి సీటింగ్ కెపాసిటీ ఉన్న ఈ విమానం బరువు 2010 కేజీలు. కాగా, ఇది 2వేల కిలోమీటర్ల వరకూ వెళ్లగలదు. దీని అత్యధిక వేగం గంటకు 342 కిలోమీటర్లు. దీని తయారీ కోసం అమోల్ ఇప్పటి వరకూ రూ.10 కోట్లు ఖర్చు పెట్టారు. ప్రతి నెలా తనకు వచ్చే శాలరీని దీని కోసమే వాడారు.