బీసీసీఐకి షాక్ ఇచ్చిన స్టార్ స్పోర్ట్స్.. అక్కడ మ్యాచ్‌లు ప్రసారం చేయలేం

by Shiva |   ( Updated:2021-04-03 10:37:28.0  )
బీసీసీఐకి షాక్ ఇచ్చిన స్టార్ స్పోర్ట్స్.. అక్కడ మ్యాచ్‌లు ప్రసారం చేయలేం
X

దిశ, స్పోర్ట్స్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ మరో వారం రోజుల్లో ప్రారంభం కానుండగా బ్రాడ్‌కాస్టర్ స్టార్ స్పోర్ట్స్ షాక్ ఇచ్చింది. ముంబయిలోని వాంఖడే స్డేడియం గ్రౌండ్స్‌మెన్ కరోనా బారిన పడిన నేపథ్యంలో తమ సిబ్బందిని అక్కడకు పంపి ప్రమాదంలో పడలేయమని.. ఆక్కడ జరిగే మ్యాచ్‌లను ప్రసారం చేయలేమని బీసీసీఐకి అల్టిమేటం జారీ చేసింది.

ఈ మేరకు ఒక స్పోర్ట్స్ వెబ్‌సైట్ కథనాన్ని ప్రచురించింది. అక్షర్ పటేల్‌తో పాటు 10 మంది గ్రౌండ్స్‌మెన్, ఆరుగురు ఈవెంట్ మేనేజర్లు కరోనాబారిన పడ్డారు. దీంతో వేదికను మార్చాలని డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. హైదరాబాద్‌లో కరోనా కేసులు నామమాత్రంగానే నమోదు అవుతున్నాయి. అంతే కాకుండా తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే ఐపీఎల్ నిర్వహణకు పూర్తి సహకారం అందిస్తామని హామీ కూడా ఇచ్చింది. రాష్ట్ర మంత్రి కేటీఆర్ కూడా బీసీసీఐకి ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. ముంబయి పరిస్థితిని గమనించిన బీసీసీఐ ప్రస్తుతం హైదరాబాద్‌ను స్టాండ్ బై వేదికగా నిర్ణయించినట్లు సమాచారం. అక్కడ పరిస్థితిని పూర్తిగా సమీక్షించి హైదరాబాద్‌కు మ్యాచ్‌లు తరలించే అవకాశాలను పరిశీలిస్తున్నదని బీసీసీఐ అధికారి ఒకరు వెల్లడించారు.

Advertisement

Next Story