- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ముంబై చేతిలో ఢిల్లీ చిత్తు చిత్తు
దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్ 51వ మ్యాచ్‌లో 111 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ ఘన విజయం సాధించింది. కేవలం 14.2 ఓవర్లలోనే 1 వికెట్ నష్టానికి 111 పరుగులు చేసింది. దీంతో ఢిల్లీ క్యాపిటల్స్ పై 9 వికెట్ల భారీ తేడాతో గెలుపొందింది. ముంబైలో ఓపెనింగ్ వచ్చిన ఇషాన్ కిషన్ 47 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్సర్లు కొట్టి 72 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. డీకాక్ 26 పరుగులకు వెనుదిరిగినా.. వన్‌డౌన్‌లో వచ్చిన సూర్యకుమార్ యాదవ్ 12 పరుగులతో నాటౌట్‌గా ఉండి ముంబై జట్టును గెలిపించారు. ఇక ఈ మ్యాచ్‌లో కూడా ముంబై విజయం సాధించడంతో 18 పాయింట్లతో టోర్నీలో నెంబర్ 1 జట్టుగా దూసుకెళ్తోంది. సీజన్ తొలుత వరుస విజయాలతో దూసుకెళ్లిన ఢిల్లీ జట్టు చివరి దశలో వరుసగా నాలుగు మ్యాచుల్లో ఓటమి చెంది 14 పాయింట్లతో మూడో స్థానంలో కొనసాగుతోంది.
ఢిల్లీ ఇన్నింగ్స్:
ఐపీఎల్ 51వ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ చెత్త ప్రదర్శన చేసింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన బ్యాట్స్‌మెన్లకు ముంబై బౌలర్లు వెన్నులో వణుకు పుట్టించారు. పదునైన బంతులను సంధిస్తూ వికెట్లు తీస్తూనే పరుగులను కట్టడి చేశారు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో ఢిల్లీ క్యాపిటల్స్ 9 వికెట్ల నష్టానికి కేవలం 110 పరుగులకే పరిమితం అయింది. ముంబై జట్టులో జస్ప్రీత్ బుమ్రా, ట్రెంట్ బోల్ట్ తలో మూడు వికెట్లు తీసుకొని స్కోరు బోర్డును కట్టడి చేశారు.
తొలుత ఓపెనింగ్ దిగిన పృథ్వీ షా, శిఖర్ ధావన్ ఘోరంగా విఫలమయ్యారు. గబ్బర్ రెండో బంతికి డకౌట్ కావడంతో ఢిల్లీ బ్యాట్స్‌మెన్ల పై ఒత్తిడి మొదలైంది. 1 పరుగు వద్ద 1 వికెట్ కోల్పోయిన ఢిల్లీ 15 పరుగుల వద్ద పృథ్వీ షాను కోల్పోయింది. ఇక వన్‌డౌన్‌లో వచ్చిన శ్రేయాస్ అయ్యర్(25), మిడిలార్డర్‌లో వచ్చిన రిషబ్ పంత్ (21) పరుగులు చేసి పర్వాలేదనిపించారు. 50 పరుగుల వద్ద అయ్యర్ క్యాచ్ అవుట్ కాగా.. ఆ తర్వాత వచ్చిన స్టోయినిస్(2) పరుగులకే కీపర్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో 57 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన ఢిల్లీ.. 62 పరుగుల వద్ద పంత్ కూడా పెవిలియన్ చేరడంతో పీకల్లోతు కష్టాల్లో పడింది.
ఇక ఆ తర్వాతి స్థానాల్లో వచ్చిన ఆటగాళ్లు ఎవ్వరూ కూడా నిలదొక్కుకోలేకపోయారు. షిమ్రాన్ హెట్మేయర్ (11), హర్షల్ పటేల్ (5), రవిచంద్రన్ అశ్విన్(12), ప్రవీణ్ దూబే (7) నాటౌట్, కగిసో రబాడా (12) పరుగులు మాత్రమే చేశారు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో ఢిల్లీ 110 పరుగులకే పరిమితం అయింది.
బుమ్రా-బోల్ట్ హవా..
ఢిల్లీ బ్యాట్స్‌మెన్లను కట్టడి చేయడంలో యార్కర్ వీరుడు బుమ్రా, ఫాస్ట్ బౌలర్ బోల్ట్ సఫలం అయ్యారు. ఇద్దరు కలిసి చెరో 4 ఓవర్లు వేయగా.. బుమ్రా 17 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు తీసుకున్నాడు. ఇక బోల్ట్ కూడా 21 పరుగులు ఇచ్చి 3 కీలక వికట్లను తీశాడు. దీంతో ఢిల్లీ స్వల్ప స్కోరుకే పరిమితం అయింది.
స్కోర్ బోర్డ్:
Delhi Capitals Innings: 110-9 (20 Ov)
1. పృథ్వీ షా c డీకాక్ b బోల్ట్ 10(11)
2. శిఖర్ ధావన్ c సూర్యకుమార్ యాదవ్ b బోల్ట్ 0(2)
3. శ్రేయాస్ అయ్యర్ (c)st డీకాక్ b రాహుల్ చాహర్ 25(29)
4. రిషబ్ పంత్ (wk)lbw b బుమ్రా 21(24)
5. మార్క్యూస్ స్టోయినిస్ c డీకాక్ b బుమ్రా 2(3)
6. షిమ్రాన్ హెట్మేయర్ c కృనాల్ పాండ్యా b కౌల్టర్ నైల్ 11(13)
7. హర్షల్ పటేల్ lbw b బుమ్రా 5(9)
8. రవిచంద్రన్ అశ్విన్ c కృనాల్ పాండ్యా b బోల్ట్ 12(9)
9. ప్రవీణ్ దూబే నాటౌట్ 7(13)
10. కగిసో రబాడా run out (బుమ్రా) 12(7)
ఎక్స్‌ట్రాలు: 5
మొత్తం స్కోర్: 110
వికెట్ల పతనం:1-1 (శిఖర్ ధావన్, 0.3), 15-2 (పృథ్వీ షా, 2.6), 50-3 (శ్రేయాస్ అయ్యర్, 10.2), 57-4 (మార్క్యూస్ స్టోయినిస్, 11.1),
62-5 (రిషబ్ పంత్, 11.4), 73-6 (హర్షల్ పటేల్, 13.6), 78-7 (షిమ్రాన్ హెట్మేయర్, 15.2), 96-8 (రవిచంద్రన్ అశ్విన్, 18.1), 110-9 (కగిసో రబాడా, 20)
బౌలింగ్:
1. ట్రెంట్ బోల్ట్ 4-0-21-3
2. కృనాల్ పాండ్యా 3-0-13-0
3. జయంత్ యాదవ్ 3-0-18-0
4. జస్ప్రీత్ బుమ్రా 4-0-17-3
5. నాథన్ కౌల్టర్ నైల్ 2-0-14-1
6. రాహుల్ చాహర్ 4-0-24-1
Mumbai Indians Innings: 111-1 (14.2 Ov)
1. ఇషాన్ కిషన్ నాటౌట్ 72(47)
2. క్వింటాన్ డీ కాక్ (wk) b నొర్ట్జే 26(28)
3. సూర్యకుమార్ యాదవ్ నాటౌట్ 12(11)
ఎక్స్‌ట్రాలు: 1
మొత్తం స్కోరు: 111-1
వికెట్ల పతనం: 68-1 (క్వింటన్ డీకాక్, 10.2)
బౌలింగ్:
1. రవిచంద్రన్ అశ్విన్ 4-0-18-0
2. కగిసో రబాడా 3-0-27-0
3. ఎన్రిచ్ నొర్ట్జే 2.2-0-25-1
4. మార్క్యూస్ స్టోయినిస్ 1-0-40-0
5. ప్రవీణ్ దూబే 3-0-29-0
6. హర్షల్ పటేల్ 1-0-8-0