హైకోర్టు సంచలన తీర్పు: సెక్స్ లో పాల్గొనడం యువతి తప్పు.. యువకుడికి బెయిల్

by Anukaran |   ( Updated:2021-07-07 07:46:02.0  )
mumbai high court verdict
X

దిశ, వెబ్‌డెస్క్: భారత దేశం సంప్రదాయాలకు పుట్టినిల్లు. ఇక వివాహ వ్యవస్థలో భారతీయులు ఎంత ఖచ్చితంగా ఉంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు, కాకపోతే కాలం మారేకొద్దీ సమాజంలో చాలా మార్పులు వచ్చాయి. వాటితో పాటే వివాహ వ్యవస్థలోనూ చాలా మార్పులు వచ్చాయి. ఒకప్పుడు వధూవరులు, ఒకరినొకరు చూసుకోకుండానే పెళ్లి చేసుకునేవారు.. ఆ తర్వాత పెద్దల సమక్షంలో ఒకరినొకరు చూసుకొని పెళ్లి చేసుకునేవారు. ఇక ప్రస్తుతమయితే అన్ని ఆన్ లైన్ లోనే ముహుర్తాలు, పెళ్లిళ్లు అవుతున్నాయి. ఇంకా కొంతమంది అయితే సహా జీవనం పేరుతో పెళ్లి కాకుండానే ఒకే ఇంట్లో ఉండి నచ్చితే పెళ్లి చేసుకుంటున్నారు, నచ్చకపోతే విడిపోతున్నారు. ఆ సమయంలో వారిద్దరూ శారీరకంగా దగ్గరైన, అమ్మాయి గర్భవతి అయినా పెద్దగా పట్టించుకోవడం లేదు కూడా. ఇలా ఉన్న ఈ సమాజంలో కాబోయే భర్త తనను రేప్ చేశాడని ఓ యువతి కోర్టుకెక్కింది.

వివరాలలోకి వెళితే.. ముంబైకి చెందిన ఓ అమ్మాయికి గతేడాది జనవరిలో ఓ యువకుడితో నిశ్చితార్థం జరిగింది. నవంబర్ 2020లో వివాహానికి కుటుంబాలు నిర్ణయించాయి. కరోనా కారణంగా లాక్ డౌన్ పడడంతో 2021లో వివాహానికి ముహూర్తం పెట్టారు. రెండు కుటుంబాలకు అంగీకారం కావడంతో అమ్మాయి, అబ్బాయి ఇద్దరు కలుసుకోవడం మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలోనే ఆ జంట మధ్య సాన్నిహిత్యం పెరిగింది. దీంతో మార్చి నెలలో తన ఇంటికి ఆహ్వానించిన యువకుడు, యువతిని లొంగదీసుకున్నాడు. కాబోయే భర్తే కదా అని ఆమె కూడా సహకరించింది. ఇలా రెండు, మూడు సార్లు జరిగింది. ఇక ఇటీవల యువకుడు, యువతి ని దూరం పెట్టడం మొదలుపెట్టాడు. తనను పెళ్లి చేసుకోవడం ఇష్టంలేదని చెప్పాడు. దీంతో షాక్ అయిన యువతి అతడిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది.

ఇటీవల ఈ కేసుపై విచారణ చేపట్టిన హైకోర్టు తాజాగా సంచలన తీర్పునిచ్చింది. వరుడికి ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. 2020లో వీరిద్దరి వివాహం కుటుంబ సమస్యల కారణంగా ఆగిపోయిందని.. ఆ తర్వాత పెళ్లి సాధ్యం కాదని తెలిసి కూడా ఆ యువతి, యువకుడితో శారీరక సంబంధం పెట్టుకుందని వరుడు తరుఫున లాయర్ వాదించాడు. యువతి అంగీకారంతోనే శృంగారం జరిగిందని.. ఇది రేప్ కేసు కిందకు ఎలా పరిగణలోకి తీసుకుంటారని వాదించారు. వాదోపవాదనలు విన్న న్యాయస్థానం యువకుడికి బెయిల్ మంజూరు చేసింది. యువతి పెళ్లి జరగదని తెలిసినా శృంగారంలో పాల్గొనడం తప్పని, ఈ కేసు లో యువకుడిని దోషిగా నిర్దారించలేమని తెలిపింది.

Read more:

శోభనం గదిలో వధువుకు షాకిచ్చిన భర్త.. అత్తా, ఆడపడుచుతో కలిసి ఆ రాత్రి..

Advertisement

Next Story