- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రిలయన్స్ రిటైల్ వెంచర్స్‌లో కేకేఆర్ సంస్థకు వాటా
దిశ, వెబ్‌డెస్క్: ఇటీవల పెట్టుబడుల సమీకరణతో దూసుకెళ్తున్న రిలయన్స్ రిటైల్ విభాగంలోకి అమెరికా సంస్థ కేకేఆర్ పెట్టుబడులు పెట్టనున్నట్టు సెప్టెంబర్ 23న ప్రకటించిన సంగతి తెలిసిందే. గురువారం కేకేఆర్ సంస్థ నుంచి రూ. 5,550 కోట్లను నగదు అందినట్టు స్టాక్ ఎక్స్ఛేంజీలకు రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్(ఆర్ఐఎల్) తెలియజేసింది. దీంతో రిలయన్స్ రిటైల్ వెంచర్స్‌లో కేకేఆర్ సంస్థకు 1.2 శాతం వాటా దక్కనుంది.
ఈ ఏడాది ఆర్ఐఎల్ వ్యాపారంలో కేకేఆర్ చేసిన రెండో పెట్టుబడి ఇది. టెలికాం వింభాగం జియో ప్లాట్‌ఫామ్స్ లిమిటెడ్‌లో కేకేఆర్ రూ. 11,367 కోట్లను ఇన్వెస్ట్ చేసింది. మళ్లీ, రిటైల్ విభాగంలోనూ పెట్టుబడులను కొనసాగించింది. ‘కేకేఆర్ సంస్థ విభాగం అలిసమ్ ఏషియా హోల్డింగ్స్ నుంచి రిలయన్స్ అనుబంధంగా ఉన్న రిటైల్ వెంచర్స్ లిమిటెడ్‌కు రూ. 5,550 కోట్లను పెట్టుబడుల రూపంలో అందుకున్నట్ట్, ఈ మొత్తానికి 8,13,48,479 ఎక్విటీ షేర్లను కేకేఆర్ సంస్థకు కేటాయించామని రిలయన్స్ సంస్థ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో పేర్కొంది.
రిలయన్స్ రిటైల్ సంస్థ దేశీయంగా 12 వేల దుకాణాలను నిర్వహిస్తోంది. ఈ ఏడాది ఆగష్టులో ఆర్ఐఎల్..రిటైల్, హోల్‌సేల్ వ్యాపారాలను నిర్వహించే ఫ్యూచర్ గ్రూపునకు చెందిన లాజిస్టిక్స్, గిడ్డంగుల వ్యాపారాన్ని కొనుగోలు చేసింది. కాగా, కేకేఆర్ సంస్థకు వాటాలను విక్రయించడానికి ముందు రిలయన్స్ రిటైల్ విలువ రూ. 4.21 లక్షల కోట్లుగా ఉంది.