కరోనా చికిత్సకు ఆక్సిజన్ సరఫరా చేయనున్న రిలయన్స్!

by Harish |   ( Updated:2021-04-15 08:49:46.0  )
కరోనా చికిత్సకు ఆక్సిజన్ సరఫరా చేయనున్న రిలయన్స్!
X

దిశ, వెబ్‌డెస్క్: రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అధినేత ముఖేష్ అంబానీ కొవిడ్ బారిన పడిన వారికోసం కీలక నిర్ణయం తీసుకున్నారు. దేశంలో పెరుగుతున్న మొత్తం కేసుల్లో సగం వరకు మహారాష్ట్రలోనే నమోదవుతుండటంతో ఆక్సిజన్ నిల్వలు తగ్గిపోతున్నాయి. ఈ క్రమంలో రిలయన్స్ సంస్థ కరోనా బారిన పడిన వారికి అవసరమ ఆక్సిజన్‌ను అందించడానికి గుజరాత్ రిఫైనరీ నుంచి ఆక్సిజన్ వాయువును సరఫరా చేయనున్నట్టు గురువారం ప్రకటించింది. ప్రపంచంలోనే అతిపెద్ద పెద్దదైన గుజరాత్‌లోని జామ్‌నగర్ రిలయన్స్ రిఫైనరీ నుంచి ఆక్సిజన్ను మహారాష్ట్రకు సరఫరా చేయనున్నట్టు రిలయన్స్ ఉన్నతాధికారి వెల్లడించారు. రిలయన్స్ పెట్రోలియం కోక్ గ్యాసిఫికేషన్ కేంద్రాల్లో వినియోగానికి ఉంచిన ఆక్సిజన్‌ను కరోనా రోగులకోసం వాడటానికి సరఫరా చేయనున్నట్టు ఉన్నతాధికారి తెలిపారు. మొత్తం 100 టన్నుల ఆక్సిజన్‌ను ఉచితంగా సరఫరా చేయనున్నట్టు కంపెనీ ఓ ప్రకటనలో పేర్కొంది.

Advertisement

Next Story

Most Viewed