- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రైట్స్ ఇష్యూ ద్వారా ముఖేశ్ అంబానీకి 5.52 లక్షల ఈక్విటీ షేర్లు!
దిశ, వెబ్‌డెస్క్: రిలయన్స్ ఇండస్ట్రీస్ రెగ్యులేటరీ సమాచారం ప్రకారం కంపెనీ జారీ చేసిన రూ.53,124 కోట్ల రైట్స్ ఇష్యూ ద్వారా కంపెనీ చైర్మెన్ ముఖేశ్ అంబానీ 5.52 లక్షల ఈక్విటీ షేర్లను దక్కించుకున్నారు. దీంతో ముఖేశ్ అంబానీకి రిలయన్స్ కంపెనీలో మొత్తం ఈక్విటీ షేర్లు 80.52 లక్షలకు పెరిగాయి. రైట్స్ ఇష్యూకు ముందు 75 లక్షల ఈక్విటీ షేర్లు ఉన్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. అలాగే, ఈ రైట్స్ ఇష్యూలో ముఖేశ్ సతీమణీ నీతా అంబానీ, కుమార్తె ఇషా అంబానీ, కుమారులు ఆకాశ్, అనంత్‌లకు ఒక్కొక్కరికీ 5.52 లక్షల ఈక్విటీ షేర్లు కలిగి ఉన్నారు. కంపెనీలో ఒక్కొక్కరికీ 0.12 శాతాం వాటా ఉంది. రైట్స్ ఇష్యూలో ప్రమోటర్స్ గ్రూపునకు 22.50 కోట్ల ఈక్విటీ షేర్లు లభించాయి. దీంతో షేర్ హోల్డింగ్ వాటా 50.29 శాతానికి సాధించింది. అలాగే, పబ్లిక్ షేర్ హోల్డింగ్ వాటా 49.71 శాతానికి తగ్గింది. ప్రభుత్వ బీమా లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ) 2.47 కోట్ల ఈక్విటీ షేర్ల సభ్యత్వాన్ని దక్కించుకుంది. ఈ కొనుగోలు ద్వారా ఎల్ఐసీ వద్ద 37.18 కోట్ల షేర్లు ఉన్నాయి. ఈ క్రమంలో రిలయన్స్ కంపెనీలో ఎల్ఐసీ షేర్ హోల్డింగ్ వాటా 6 శాతానికి పెరిగింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ ఇటీవల రూ.53,124 కోట్లు సమీకరణ లక్ష్యంగా రైట్స్ ఇష్యూలో 42.26 షేర్లను విక్రయానికి ఉంచింది. ఒక షేర్ ధరను రూ.1,257 నిర్ణయించింది. దీనికి ఇన్వెస్టర్స్ నుంచి భారీ స్పందన వచ్చింది. గతవారం జూన్ 3న రైట్స్ ముగిసింది. ఈ స్పందనతో రిలయన్స్ ఇండస్ట్రీస్ రూ.84 వేల కోట్లను సమకూర్చుకుంది.