మీతోనే ఉంటా… ఇబ్బంది పెట్టొద్దు !

by srinivas |
మీతోనే ఉంటా… ఇబ్బంది పెట్టొద్దు !
X

దిశ, ఏపీ బ్యూరో: కాపు ఉద్యమంలోకి తాను వచ్చేది లేదంటూ ముద్రగడ పద్మనాభం మరోసారి స్పష్టం చేశారు. సోమవారం ఉదయం ముద్రగడను కాపు జేఏసీ నేతలు కలిసి ఉద్యమ నేతగా కొనసాగాలని కోరగా.. ఆయన సున్నితంగా తిరస్కరించారు. వ్యక్తిగతంగా మీతోనే ఉంటానని, తనను ఇబ్బంది పెట్టొద్దని సూచించారు. కొద్దిరోజుల క్రితమే కాపు ఉద్యమం నుంచి తప్పుకుంటున్నట్లు ముద్రగడ ప్రకటించిన విషయం తెలిసిందే. కాపు ఉద్యమ నేతలు కలిసి వెళ్లిన తర్వాత ముద్రగడ ఓ లేఖను విడుదల చేశారు.

Advertisement

Next Story