ఆ స్టేడియంలో బౌండరీల మోత.. ధోని మళ్లీ మొదలుపెట్టాడు..!

by Anukaran |   ( Updated:2023-04-01 17:36:02.0  )
ఆ స్టేడియంలో బౌండరీల మోత.. ధోని మళ్లీ మొదలుపెట్టాడు..!
X

దిశ, వెబ్‌డెస్క్: గత సీజన్ ఐపీఎల్‌లో దారుణంగా విఫలమైన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు 14వ సీజన్‌కు కసరత్తులు చేస్తోంది. చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో సీఎస్కే జట్టు ప్రాక్టీస్ మొదలుపెట్టింది. ముఖ్యంగా కెప్టెన్ ధోని తిరిగి ఫామ్‌లోకి వచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాడు. ప్రాక్టీస్ సెషన్‌లో భారీ షాట్లు కొడుతూ అదరగొడుతున్నాడు. దీనికి సంబంధించిన వీడియోను csk జట్టు సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేస్తూ.. ‘Mahi way all the way’ అంటూ కాప్షన్ పెట్టింది. ఈ వీడియో చూసిన అభిమానులే కాకుండా.. క్రికెటర్లు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే గత ఐపీఎల్‌లో చివరిసారిగా దర్శనమిచ్చిన ధోని మళ్లీ పెద్దగా తెర మీద కనిపించలేదు. ఇటువంటి సమయంలో భారీ షాట్లు కొడుతున్న ధోని వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఇప్పటికే జట్టులో కీలక మార్పులు చేసిన చెన్నై సూపర్ కింగ్స్ 14వ సీజన్ పై గురిపెట్టిందని క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు.

Advertisement

Next Story