కూల్ కెప్టెన్ ధోని ఇంట్లో కరోనా కలకలం.. ఆందోళనలో క్రికెట్ ఫాన్స్

by Anukaran |   ( Updated:2021-04-21 00:41:13.0  )
కూల్ కెప్టెన్ ధోని ఇంట్లో కరోనా కలకలం.. ఆందోళనలో క్రికెట్ ఫాన్స్
X

దిశ, వెబ్ డెస్క్: దేశంలో కరోనా విలయ తాండవం చేస్తుంది. సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులను సైతం కరోనా వదలడం లేదు. తాజాగా భారత మాజీ క్రికెట్ కెప్టెన్ ఎంఎస్ ధోని ఇంట కరోనా కలకలం రేపింది. ధోని తల్లిదండ్రులు కరోనా బారిన పడ్డారు. తల్లి దేవకి దేవి, తండ్రి పాన్ సింగ్‌కు తాజాగా జరిపిన పరీక్షల్లో కోవిడ్ -19 పాజిటివ్ అని తెలింది. ప్రస్తుతం వారిద్దరిని రాంచీలోని పల్స్‌ సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇకపోతే ప్రస్తుతం ధోని చెన్నై సూపర్ కింగ్స్ కి సారథ్యం వహిస్తున్న విషయం తెలిసిందే. ఈరోజు చెన్నై, కోల్‌కతా నైట్‌రైడర్స్‌ తో తలపడనుంది.

Advertisement

Next Story

Most Viewed