అత్యుత్తమ కెప్టెన్ ధోనినే : చాపెల్

by Shiva |
అత్యుత్తమ కెప్టెన్ ధోనినే : చాపెల్
X

దిశ, స్పోర్ట్స్ : మిస్టర్ కూల్ ఎంఎస్ ధోనిపై ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్, టీం ఇండియా మాజీ కోచ్ గ్రెగ్ చాపెల్ ప్రశంసల జల్లు కురిపించాడు. తాను చూసిన అత్యుత్తమ కెప్టెన్లలో ధోని ఒకడని, భారత జట్టుకు నేతృత్వం వహించిన వారిలో అతడే నెంబర్ వన్ కెప్టెన్ అని కొనియాడాడు. గత అర్థ శతాబ్ధిలో క్రికెట్‌ను ప్రభావితం చేసిన సారథుల్లో ధోని తప్పక ఉంటాడని అన్నాడు. ధోని అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగు పెట్టిన తొలి నాళ్లలో టీమ్ ఇండియా కోచ్‌గా చాపెల్ ఉన్నాడు. ధోని రిటైర్ అయిన సందర్భంగా అతడితో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నాడు.

‘నేను చూసిన అత్యుత్తమ భారత కెప్టెన్ ధోనినే. గత 50 ఏళ్ల క్రికెట్‌ చరిత్రలో మైఖెల్ బ్రేర్లీ, ఇయాన్ చాపెల్, మార్క్ టేలర్, క్లైవ్ లాయడ్ తమ సారథ్యంతో అత్యంత ప్రభావం చూపారు. వారి సరసన ధోని కూడా నిలుస్తాడు. అతనిలో ఉన్న అత్యుత్తమ లక్షణం ఆత్మవిశ్వాసం. సహచర ఆటగాళ్లను ప్రోత్సహించేవాడు. అతనికి రాజకీయాలు చేయడం తెలియదు. ఏదైనా నేరుగా మాట్లాడుతాడు. ధోనితో పని చేయడం చాలా సులువు. అతడు సవాళ్లను బాగా ఇష్టపడేవాడు. నా అంచనాలను ధోని ఎప్పుడూ అందుకునే వాడు’ అని చాపెల్ కొనియాడాడు. 2005 నుంచి 2007 వరకు కోచ్‌గా పని చేసిన చాపెల్.. చాలా దగ్గర నుంచి ధోనిని గమనించాడు. అతడో గొప్ప మ్యాచ్ ఫినిషర్ అని కితాబిచ్చాడు.

Advertisement

Next Story

Most Viewed